AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water vs Sugarcane: చెరకు రసం vs కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో ఏది బెస్ట్?

వేసవి వేడిని తట్టుకోవడానికి, డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి, వేడి నుండి రక్షించుకోవడానికి ఇవి రెండు మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. కానీ, ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా? మీరు కూడా ఇదే గందరగోళంలో ఉన్నారా..? అయితే, మీ కోసమే ఈ సమాచారం. చెరుకు రసం, కొబ్బరి నీళ్లలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

Coconut Water vs Sugarcane: చెరకు రసం vs కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో ఏది బెస్ట్?
Coconut Water Vs Sugarcane Juice
Jyothi Gadda
|

Updated on: Feb 24, 2026 | 2:31 PM

Share

వేసవి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం,సాయంత్రం చలి, మధ్యాహ్న సమయంలో విపరీతమైన ఎండ ఇబ్బందిపెడుతోంది. తీవ్రమైన ఎండ, దాహంతో ప్రజలు ఇప్పటికే చెరకు రసం, కొబ్బరి నీళ్ళ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు.వేసవి వేడిని తట్టుకోవడానికి, డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి, వేడి నుండి రక్షించుకోవడానికి ఇవి రెండు మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. కానీ, ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా? మీరు కూడా ఇదే గందరగోళంలో ఉన్నారా..? అయితే, మీ కోసమే ఈ సమాచారం. చెరుకు రసం, కొబ్బరి నీళ్లలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు-

కొబ్బరి నీళ్ళు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన, అత్యంత సహజమైన పానీయం. దీని అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుతాయి. కొబ్బరి నీళ్ళు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండవు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే కొబ్బరి నీరు అద్భుతమైన డ్రింక్.

చెరకు రసం ప్రయోజనాలు-

వేసవి కాలంలో చెరకు రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవిలో చెరకు రసంలో ఐస్‌ క్యూబ్స్‌ కలిపి తాగడం ఒక ప్రత్యేకమైన ఆనందం. చెరకు రసంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో, కామెర్లు వంటి వ్యాధులకు చెరకు రసం చాలా ప్రయోజనకరం. ఇందులో ఎముకలు, రక్తానికి మేలు చేసే కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి.

ఏది మంచిది?

ఇకపోతే, ఈ రెండింటిలో ఏది బెటర్‌ అనే విషయానికి వస్తే.. హైడ్రేషన్ కోసం ఈ పానీయాలు తీసుకోవాలనుకుంటే, కొబ్బరి నీళ్లు ఉత్తమమైనవి. అదే సమయంలో, మీరు చాలా అలసిపోయి శక్తి అవసరమైతే, చెరకు రసం మీకు బెస్ట్‌ అప్షన్ అవుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు మాత్రం చెరకు రసం తాగడం సరైనది కాదు. బయట చెరకు రసం తాగేటప్పుడు శుభ్రత పట్ల కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈగలు, దుమ్ము,ధూళి కడుపు నొప్పికి కారణమవుతాయి. కొబ్బరి నీళ్లు కడుపుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us