Meter Movie: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ‘మీటర్’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
డైరెక్టర్ రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ విడుదలకు ముందు వచ్చినంత హైప్.. రిలీజ్ అయ్యాక మాత్రం అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అలాగే ఒకేరోజు దసరా సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమాకు అంతగా కలక్షన్స్ రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోన్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఈమూవీ తర్వాత కిరణ్ నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే వినరో భాగ్యము విష్ణు కథా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. అనుకున్నంతగా ఈ మూవీ క్లిక్ అవ్వకపోయినా.. పాజిటివ్ రివ్యూ మాత్రం సొంతం చేసుకుంది. ఆవెంటనే వచ్చిన మీటర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ విడుదలకు ముందు వచ్చినంత హైప్.. రిలీజ్ అయ్యాక మాత్రం అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అలాగే ఒకేరోజు దసరా సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమాకు అంతగా కలక్షన్స్ రాలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతుంది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రాబోతుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇందులో కిరణ్ సరసన తమిళ్ బ్యూటీ అతుల్య రవి నటించింది.
ఈ సినిమాతోనే అతుల్య తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురైన అవమానాలను చూస్తూ పెరిగిన హీరో..ఆ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ కాలం కలిసొచ్చి ఆ జాబ్ వస్తే మానేయాలనుకుంటాడు. అలాంటి అతను అదే ఉద్యోగంలోనే ఉండిపోవాలనేంతగా మార్చిన సంఘటన ఏది అనేది కథ. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.