Samantha: మయోసైటిస్‏తో ఇంకా పోరాడుతున్న సమంత.. మరో చికిత్స తీసుకుంటున్న సామ్..

గత రెండు రోజుల క్రితం అమెరికాలో సిటాడెల్ ప్రీమియర్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే సామ్ మయోసైటిస్ సమస్యతో ఇంకా పోరాడుతునే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె ఇంకా చికిత్స తీసుకుంటుంది. వ్యాధి నుంచి ఆమె పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య కావడంతో దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం పడుతుంది.

Samantha: మయోసైటిస్‏తో ఇంకా పోరాడుతున్న సమంత.. మరో చికిత్స తీసుకుంటున్న సామ్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2023 | 2:27 PM

సమంత.. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్‏గా స్టార్ డమ్. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న సామ్.. గత ఏడాది కాలంగా ఎన్నో కష్టాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోంటుంది. విడాకుల తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆమె.. అంతలోనే మయోసైటిస్ భారిన పడింది. కొన్ని నెలలు ఇంట్లోనే ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె.. కోలుకుని ఇటీవలే శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత.. దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం సామ్ సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ లలో పాల్గొంటుంది. గత రెండు రోజుల క్రితం అమెరికాలో సిటాడెల్ ప్రీమియర్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే సామ్ మయోసైటిస్ సమస్యతో ఇంకా పోరాడుతునే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె ఇంకా చికిత్స తీసుకుంటుంది. వ్యాధి నుంచి ఆమె పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య కావడంతో దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం పడుతుంది.

ప్రస్తుతం సామ్.. హైపర్ బారిక్ థెరపీ చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో అభిమానులు షాకయ్యారు. అయితే తాను తీసుకుంటున్న చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఆమె షేర్ చేశారు. మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు బాధిస్తాయి. శరీరమంతటా నొప్పులు ఉంటాయి. దీంతో శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పోవడానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి వీలుగా సమంత హైపర్ బారిక్ థెరపీ చేయించుకుంటుంది.

హైపర్ బారిక్ చికిత్స…

హైపర్ బారిక్ థెరపీ.. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటి చాలా రకాల ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఈ చికిత్స ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. న్యూరోడీజెనరిక్ కండీషన్స్, ఆటిజం, ట్రొమాటిక్ బ్రెయిన్ గాయాలకు ఈ థెరపీ పనిచేస్తుంది. ఈ చికిత్సలో దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకుంటుంది. నిర్ణీత ప్రెజర్ తో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడమే హైపర్ బారిక్ చికిత్స. సాధారణ వాయు పీడనంలో మనం తీసుకునే ఆక్సిజన్ తో పోలిస్తే ఈ చికిత్స రూపంలో ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. ఇలా అదనపు ఆక్సిజన్ అనేది బ్యాక్టీరియాపై పోరాటంలో సాయపడుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్, స్టెమ్ సెల్స్ విడుదలకు ప్రేరేపిస్తుంది. దాంతో ఈ సమస్య నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.