Tollywood: టాలీవుడ్‏పై ఫోకస్ చేసిన బాలీవుడ్ స్టార్స్.. విలనిజంతో రఫ్పాడిస్తోన్న టాప్ హీరోస్..

కేవలం హీరోగానే కాకుండా విలనిజంతోనూ మెప్పించేందుకు సిద్ధమవుతన్నారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో ప్రతినాయకుడిగా రప్ఫాడించారు హీరో సంజయ్ దత్. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ సైతం విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.

Tollywood: టాలీవుడ్‏పై ఫోకస్ చేసిన బాలీవుడ్ స్టార్స్.. విలనిజంతో రఫ్పాడిస్తోన్న టాప్ హీరోస్..
Saif, Sanjay Dutt
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 23, 2023 | 8:16 AM

గత కొంత కాలంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి దక్షిణాది చిత్రాలు. బాహుబలి , ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతార సినిమాలు సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాను బాక్సాఫీస్‍ను ఏలేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలపై నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు హిందీ స్టార్స్. కేవలం హీరోగానే కాకుండా విలనిజంతోనూ మెప్పించేందుకు సిద్ధమవుతన్నారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో ప్రతినాయకుడిగా రప్ఫాడించారు హీరో సంజయ్ దత్. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ సైతం విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.

అలాగే బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబురాయ్ తెలుగులో వినయ విదేయ రామ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. అలాగే అజిత్ నటించిన తమిళ్ మూవీలోనూ నటించారు. ఇక కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్ర ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాత్రలో సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తోన్న లియో చిత్రంలోనూ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగ ప్రభాస్..మారుతి కాంబోలో రాబోతున్న చిత్రంతోపాటు.. రెండు కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒక్కో సినిమాకు సంజయ్ దత్ రూ. 5 నుంచి 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటివరకు హీరోగా నార్త్ ఆడియన్స్ ను అలరించిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు విలన్ గా భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ చూస్తే ఈ సినిమాలో సైఫ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమవుతుంది. ఇదే కాకుండా.. తాజాగా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న తారక్ 30 సినిమాలోనూ సైఫ్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సైఫ్ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ ఇద్దరు స్టార్స్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ