Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వెళ్లిన ఒకే ఒక్క హీరో.. ఇండస్ట్రీ నుంచి అతనే ఎందుకు వెళ్లారంటే..
ఎన్నో అవమానాలు.. ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆ అందాల తార..చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ? తనే.. మత్తు కళ్ల సుందరి సిల్క్ స్మిత. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన అందాల తార. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె.. చివరకు సూసైడ్ చేసుకుని ఈ లోకానికి దూరమైంది.
సినిమా అంటే ఆమెకు విపరీతమైన పిచ్చి. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నిషా కళ్లతో తనదైన అందంతో సినీప్రియులను కట్టిపడేసింది. స్పెషల్ సాంగ్స్.. గ్లామర్ షోలతో అభిమానులను సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న ఆమె జీవితంలో మాత్రం సినిమాలకు మించి ట్విస్ట్లు ఉన్నాయి. ఎన్నో అవమానాలు.. ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆ అందాల తార..చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ? తనే.. మత్తు కళ్ల సుందరి సిల్క్ స్మిత. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన అందాల తార. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె.. చివరకు సూసైడ్ చేసుకుని ఈ లోకానికి దూరమైంది.
సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కానీ భర్త వేధింపులు తట్టుకోలేక తన పిన్నిగారి ఇంటికి వెళ్లింది. తన పిన్నితో కలిసి మద్రాసులో అడుగుపెట్టింది. అలా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓ దర్శకుడి కంట పడడంతో సినిమా అవకాశాలను అందుకుంది. మొదటి సైడ్ డ్యానర్స్ గా స్టార్ట్ చేసి.. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ కు కెరాఫ్ అడ్రస్ గా మారింది. అప్పట్లో స్పెషల్ సాంగ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సిల్క్ స్మిత. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారు. ఆమె కోసమే సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టేవారు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న సిల్క్.. ప్రేమలో మోసపోయింది. బ్రేకప్ జరగడంతో మద్యానికి బానిసయ్యింది. దీంతో సినిమాలపై ఫోకస్ తగ్గించింది.
చాలా కాలం మానసిక సంఘర్షనకు గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుని ఈ లోకానికి దూరమయ్యారు. అయితే ఎన్నో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న సిల్క్ స్మిత చనిపోతే.. ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా రాలేదు. కానీ కన్నడ హీరో అర్జున్ మాత్రమే సిల్క్ స్మిత అంతిమ సంస్కరాలకు హజరయ్యారు. అక్కడ మీడియా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాకపోయినా.. మీరు మాత్రం ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. అర్జున్ స్పందిస్తూ.. సిల్క్ స్మితతో తాను ఓ సినిమాలో నటించానని అప్పుడు సిల్క్ స్మిత నేను చనిపోతే కనీసం నువ్వైనా వస్తావా అంటూ ప్రశ్నించందని చెబుతూ ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం ఈ న్యూస్ మరోసారి ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.