Raviteja: మరోసారి మల్టీస్టారర్ చేయబోతున్న మాస్ మాహారాజా.. ఆ యంగ్ హీరోతో రవితేజ మూవీ ?..
ఏడాది మొదట్లో చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన రవితేజ.. ఇప్పుడు మరో యంగ్ హీరోతో మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లుగా సమాచారం.
టాలీవుడ్ మాస్ మాహరాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ధమాకా.. వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు రవితేజ. ఇక ఇటీవల ఆయన విలనిజంలో నటించిన రావణాసుర మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మాస్ మాహరాజా మల్టీస్టారర్స్ మీద గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏడాది మొదట్లో చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన రవితేజ.. ఇప్పుడు మరో యంగ్ హీరోతో మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లుగా సమాచారం.
తొలి చిత్రం కలర్ ఫోటో సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించారు డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ సినిమాకు ప్రాంతీయ మూవీగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ మూవీ కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నారు. రవితేజ, శర్వానంద్ లతో సూపర్ మల్టీస్టారర్ కథ చేసేందుకు స్క్రీప్ట్ రెడీ చేస్తున్నాడ. ఇప్పటికే ఈ స్టోరీని రవితేజకు వినిపించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక మరోవైపు శర్వానంద్ కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ శర్వానంద్ కాకపోతే.. డీజే టిల్లు ఫేం సిద్ధుని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఓ లెక్చరర్, స్టూడెంట్ మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రిలేషన్ తర్వాత గొడవలు చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట.
అంతేకాకుండా.. వీరిద్దరికి మంచి లవ్ స్టోరీస్ కూడా ఉండబోతున్నాయట. ఈ సినిమాను జీ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రావణాసుర సినిమాతో థియేటర్లలో సందడి చేసిన రవితేజ.. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.