AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ క్విజ్.. సన్నజాజిలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..? క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. అలాగే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరించింది. ఎవరో గుర్తుపట్టారా ?. ఇటీవలే రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.

Tollywood: టాలీవుడ్ క్విజ్.. సన్నజాజిలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..? క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2023 | 8:41 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. అలాగే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరించింది. ఎవరో గుర్తుపట్టారా ?. ఇటీవలే రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. త్వరలోనే మరో అందమైన ప్రేమకథతో థియేటర్లలో సందడి చేయబోతుంది. తనే స్టార్ హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై.. సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడాల్సి రాలేదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది. తెలుగుతోపాటు..తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1987 ఏప్రిల్ 28 జన్మించింది సామ్. గ్రాడ్యూయేషన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన సామ్.. 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఎంపికైంది. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

ఈ మూవీ సమయంలో ఏర్పడిన వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు.. 2017 అక్టోబర్ 7న ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపూల్ గా ఉన్న వీరు వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ అనంతరం తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టిన సామ్.. మరోవైపు మయోసైటిస్ బారిన పడింది. కొన్ని నెలలు ఈ సమస్యకు చికిత్స తీసుకున్న సామ్.. ఇటీవలే శాకుంతలం చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీస్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.