Punch Prasad: మా ఆయనకు నా కిడ్నీనే ఇద్దామనుకున్నా.. కానీ.. పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై శుభవార్త చెప్పిన సతీమణి
గత కొన్ని రోజులుగా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. రోజురోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముడుతున్నాయి. కొత్త కొత్త ఇన్‌ఫెక్షన్లు ప్రసాద్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిలా ఉంటే పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్‌డేట్ ఇస్తోంది ఆయన సతీమణి సునీత.
ప్రముఖ జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా ఆయన క్రమంత తప్పకుండా డయాలసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. రోజురోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముడుతున్నాయి. కొత్త కొత్త ఇన్‌ఫెక్షన్లు ప్రసాద్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిలా ఉంటే పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్‌డేట్ ఇస్తోంది ఆయన సతీమణి సునీత. తాజాగా తన భర్త గురించి ఒక శుభవార్త చెప్పింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం కిడ్నీ లభించిందని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. ఇందుకోసం రెండేళ్ల క్రితం జీవన్‌దాన్‌లో కిడ్నీ కోసం అప్లయ్ చేసుకున్నామని.. ఇప్పుడు కిడ్నీ లభించిందని.. త్వరలో ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాసెస్ మొదలవుతుందని ఆమె పేర్కొంది.
అందుకే వీడియోలు చేస్తున్నా..
‘మా ఆయనకు మొదట నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ఇందుకోసం ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్నీ టెస్టులు చేశారు కూడా. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయన వయసు చిన్నది కావడంతో వైద్యులు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ఇందులో భాగంగానే జీవన్‌దాన్‌లో కిడ్నీకి అప్లై చేశాం. ఇప్పుడు కిడ్నీ అందుబాటులో ఉంది. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. ఈ విషయం యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా వైద్య పరీక్షలు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాను. మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నందుకు దయచేసి ఏమీ అనుకోకండి. ఇది కేవలం మా ఛానెల్‌ను ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాద బలంతో ఆయన త్వరలోనే కోలుకుంటున్నారని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది ప్రసాద్ భార్య.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..