Megastar Chiranjeevi: మరోసారి మెగాస్టార్ సరసన శ్రియా.. కానీ ఈసారి సినిమా కాదు..
సోషల్ మీడియాలో శ్రియా ఓ సెన్సెషనల్. ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పాత్రలతో సంబంధం లేకుండా వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రియ. పారితోషికం విషయంలో తన డిమాండ్ తగ్గినా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనిపిస్తుంది.
హీరోయిన్ శ్రియా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లై.. పాప పుట్టిన తర్వాత కూడా వరుస చిత్రాలతో ఫుల్ జోష్ మీదుంది. కథానాయికగానే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ నటిగా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ గురించి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా పొట్టి పొట్టి డ్రెస్సులతో గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో శ్రియా ఓ సెన్సెషనల్. ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పాత్రలతో సంబంధం లేకుండా వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రియ. పారితోషికం విషయంలో తన డిమాండ్ తగ్గినా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనిపిస్తుంది.
గతంలో హీరోయిన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టేసింది శ్రియా. వెంకీ, రామ్ పోతినేని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మరోసారి ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమయ్యిందట. ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాట కోసం మేకర్స్ శ్రియాను సంప్రదించగా.. ఈ భామా కూడా ఓకే చేసినట్లుగా టాక్. అంతేకాదు.. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా కన్ఫామ్ కావాల్సి ఉంది. ఇటీవల స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఇమేజ్ పక్కనపెట్టి సాంగ్స్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతున్న హీరోయిన్స్ కాకుండా.. శ్రియాను తీసుకుని నెటితరం హీరోయిన్లకు పోటీ ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అనౌన్మెంట్ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.