AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అక్కినేని హీరో కోసం రంగంలోకి యంగ్ రెబల్ స్టార్.. ఏజెంట్‏కు సపోర్ట్‏గా ప్రభాస్ ?..

ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలానే శ్రమించాడు. సిక్స్ ప్యాక్ చేశాడు..బరువు పెరిగాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‏లా కనిపించిన అఖిల్.. ఈ సినిమా కోసం పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా తన లుక్ మార్చేశాడు. ఇందుకు భయంకరమైన డైట్ ఫాలో అయ్యాడు. అతని కష్టం ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

Prabhas: అక్కినేని హీరో కోసం రంగంలోకి యంగ్ రెబల్ స్టార్.. ఏజెంట్‏కు సపోర్ట్‏గా ప్రభాస్ ?..
Prabhas, Akhil
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2023 | 9:07 AM

Share

అక్కినేని హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇందులో నూతన కథానాయిక సాక్షి వైద్య నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది సాక్షి. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే శ్రమించాడు. సిక్స్ ప్యాక్ చేశాడు..బరువు పెరిగాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‏లా కనిపించిన అఖిల్.. ఈ సినిమా కోసం పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా తన లుక్ మార్చేశాడు. ఇందుకు భయంకరమైన డైట్ ఫాలో అయ్యాడు. అతని కష్టం ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లె విడుదల చేయనున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.

ఇటీవల విడుదలైన ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సీన్స్‏తో సినిమాపై భారీగా హైప్ పెంచేసింది. ఇందులో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందనేది ట్రైలర్ తోనే చెప్పేశారు మేకర్స్. ఇప్పటివరకు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ మూవీ భారీ విజయాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. కొద్ది రోజులుగా ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్న చిత్రయూనిట్.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తుంది.

ఏప్రిల్ 23న హైదరాబాద్ లో ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. ఈ విషయంపై ఇప్పటికే నెట్టింట చర్చ జరుగుతుంది. అఖిల్ ను సపోర్ట్ చేయడానికి ప్రభాస్ రానున్నాడట. ప్రభాస్ వస్తే ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అవ్వడం సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..