Indraja: కీర్తి సురేష్‌ను మరిపించిన ఇంద్రజ.. దసరా మాస్ బీట్‌కు అదరగొట్టిన సీనియర్ హీరోయిన్..
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని, కీర్తి మక్కా ఊరమాస్ లుక్ లో కనిపించి అదరగొట్టేశారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా చమ్కీల అంగిలేసి సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీస్ సైతం ఈ పాటకు కాలు కదిపి రీల్స్ చేశారు.
కొద్ది రోజులుగా ఎక్కడా చూసిన దసరా హావానే కనిపిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే ఏకంగా రూ. 100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని… కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని, కీర్తి మక్కా ఊరమాస్ లుక్ లో కనిపించి అదరగొట్టేశారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా చమ్కీల అంగిలేసి సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీస్ సైతం ఈ పాటకు కాలు కదిపి రీల్స్ చేశారు. ఈ సాంగ్ తర్వాత నెట్టింట పాపులర్ అయిన మరో బీట్ కీర్తి సురేష్ డాన్స్ చేసిన మాస్ బీట్.
పెళ్లి కూతురి చీరలో కీర్తి వేసిన ఈ మాస్ డ్యాన్స్ నెట్టింట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఫుల్ ఎనర్జీతో పక్కా మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది కీర్తి. ఇక ఈ పాటకు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా డాన్స్ చేసి రచ్చ చేశారు. తన మాస్ స్టెప్పులతో కీర్తి సురేష్ ను మరిపించిందనే చెప్పాలి. ఇటీవల బుల్లితెరపై ఓ కామెడీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు ఇంద్రజ. ఈ షోలో భాగంగా ఆమె దసరా సినిమాలోని కీర్తి సురేష్ చేసిన మాస్ బీట్ కు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఒకప్పుడు కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇంద్రజ. హీరోయిన్ గానే కాకుండా.. సహాయ నటిగానూ మెప్పించారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో సహాయనటిగా కనిపిస్తునే.. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కొద్ది రోజులుగా పలు కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.