Hyderabad: ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ..129 తులాల గోల్డ్, వజ్రాభరణాలు మాయం

ప్రముఖ సీరియల్ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ టీవీ ఆర్టిస్ట్‌ సుమిత్రా పంపన ఇంట్లో బుధవారం దొంగలు చొరబడి దాదాపు రూ. 70 లక్షల విలువైన 129 తులాల బంగారు, వజ్రాభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు..

Hyderabad: ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ..129 తులాల గోల్డ్, వజ్రాభరణాలు మాయం
Sumitra Pampana
Follow us

|

Updated on: Apr 21, 2023 | 9:04 AM

ప్రముఖ సీరియల్ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ టీవీ ఆర్టిస్ట్‌ సుమిత్రా పంపన ఇంట్లో బుధవారం దొంగలు చొరబడి దాదాపు రూ. 70 లక్షల విలువైన 129 తులాల బంగారు, వజ్రాభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వింజమూరి శివరాం, అతని భార్య సుమిత్ర ఏప్రిల్ 17 మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 5వ అంతస్తులోని తప ఫ్లాట్‌కు తాళం వేసి, అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని మరో ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న కోడలు భువనేశ్వరికి తాళం అప్పగించి వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11.30 గంటల సమయంలో సుమిత్ర ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లెం పగలగొట్టి ఉండటం కోడలు భువనేశ్వరి గమనించింది. వెంటనే తన భర్త విజయ్ కుమార్‌తోపాటు అత్తమామలకు సమాచారం అందించింది. ఢిల్లీ నుంచి వచ్చిన సుమిత్ర బెడ్‌రూమ్‌లోని బీరువాను తనిఖీ చేయగా గోల్డ్‌ జ్యువెల్లరీ, వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు గ్రహించింది. 129 తులాల బంగారు, 293 గ్రాముల వెండి, వజ్రాభరణాలు అపహరణకు గురైనట్లు బాధితురాలు ఏప్రిల్ 19న పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సుమిత్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ ఘటనాస్థలికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఫ్లాట్‌లోని మెయిన్‌ డోర్‌ లాక్‌ పగలగొట్టి లోపలికి చొరబడ్డట్లు పోలీసులు తెలిపారు. అల్మరా లాకర్‌ను పగులగొట్టి విలువైన వస్తువులను అపహరించినట్లు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ సి హరిచంద్రారెడ్డి తెలిపారు. మరిన్ని ఆధారాల కోసం చోరీ జరిగిన అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.