AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువు అవుతుందా? నెట్టింట ఆసక్తికర చర్చ

కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఒక టాలీవుడ్ హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఈమె నా రిలేటివ్ అని చెప్పాడు. దీంతో ఈ అమ్మడి పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగిపోతోంది.

Allu Arjun: ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువు అవుతుందా? నెట్టింట ఆసక్తికర చర్చ
Allu Arjun
Basha Shek
|

Updated on: Feb 25, 2026 | 5:09 PM

Share

ఇటీవల కేరళలోని కొచ్చి వేదికగా ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తేజ సజ్జా, నిహారిక, నివేదా థామస్, శివ కార్తికయన్, మమ్ముట్టి, అంజలి, పాయల్ రాజ్ పుత్, శ్రీ గౌరి ప్రియ, హెబ్బా పటేల్, ప్రణీత, కాజల్ అగర్వాల్, జయసుధ, సిమ్రాన్.. ఇలా ఎంతో మంది తారలు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఇక ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే తేజ సజ్జా తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ అవార్డ్ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.  లెజెండరీ హీరో మమ్ముట్టి పక్కన తెలుగు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ రెడ్డి నిలబడి ఉండగా, అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. మమ్ముట్టికి ఆమెను పరిచయం చేస్తూ ‘ఈమె నా రిలేటివ్’ అని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బన్నీ స్వయంగా ఆమె తన బంధువు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీ గౌరి ప్రియ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ టాలీవుడ్ అమ్మాయి కాబట్టి మర్యాదపూర్వకంగా అలా అన్నారా? లేక నిజంగానే అల్లు అర్జున్ కు ఆమె దగ్గరి చుట్టమా? అనే సందేహాలు తీస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య పేరులో కూడా రెడ్డి అని ఉండటంతో, స్నేహ రెడ్డి వైపు నుంచి ఆమెకు బంధుత్వం ఉండవచ్చని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు.

రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీ గౌరి ప్రియ. తన అందం, అభినయంతో యూత్ క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోందీ అందాల తార. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘చెన్నై లవ్ స్టోరీ’లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. దీంతో పాటు పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇప్పుడు ఏకంగా బన్నీ నోట ఈ బ్యూటీ పేరు వినిపించడంతో ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్, పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

 ఫిల్మ్ ఫేర్ అవార్డుతో శ్రీ గౌరి ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us