AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. మరో కీలక పథకం అమలు.. ప్రతీఒక్కరికీ అందనున్న లబ్ది

జల్ జీవన్ మిషన్‌ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. మరో కీలక పథకం అమలు.. ప్రతీఒక్కరికీ అందనున్న లబ్ది
Ap Government
Venkatrao Lella
|

Updated on: Feb 25, 2026 | 5:45 PM

Share

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. దీంతో ఇప్పటినుంచి జల జీవన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తాము సమర్థవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జల జీవన్ పథకం అమలుపై శాసనమండలిలో పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

ప్రతీ ఇంటికి తాగునీరు

జల జీవన్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి సురక్షిత త్రాగునీరు అందిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తాము సమర్థవంతంగా ఆ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా భవిష్యత్తుల్లో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తిరిగి పథకాన్ని పునరుద్దరించినట్లు మనోహర్ పేర్కొన్నారు.

జల జీవన్ మిషన్ పథకం అంటే..?

ఈ పధకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కుళాయిల ద్వారా త్రాగునీరు అందించమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల నీరు అందించడం దీని ఉద్దేశం. దీని వల్ల ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం వల్ల మహిళలు నీటి కోసం క్యూలో నిల్చోవాల్సిన కష్టం తప్పుతుంది. 2019 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. 2028 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం 50 శాతం నిధులు, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించి పథకం అమలు చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఇంటింటికి నీటి కనెక్షన్ ఇస్తోంది. దీని వల్ల గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Follow Us