AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురువారంనాడు ఇలా చేస్తే.. సిరి సంపదలు, సకల శుభాలు పక్కా..!

Thursday Remedies: జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉన్నా, జీవితంలో శ్రేయస్సు, ఆర్థిక సౌభాగ్యం, వ్యక్తిత్వ అభివృద్ధి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కానీ, బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి నిత్యం ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. గురువారం నాడు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ద్వారా జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.

గురువారంనాడు ఇలా చేస్తే.. సిరి సంపదలు, సకల శుభాలు పక్కా..!
Thursday Remedies
Rajashekher G
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 6:08 PM

Share

హిందూమతం ప్రకారం గురువారం రోజు చాలా మంది శివుడు, శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే.. జీవితంలో శ్రేయస్సు, ఆర్థిక సౌభాగ్యం, వ్యక్తిత్వ అభివృద్ధి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కానీ, బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి నిత్యం ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. గురువారం నాడు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ద్వారా జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. వీటిని పాటించడం ద్వారా జీవితంలో శాంతి, సుఖసంతోషాలు, పురోగతి లభిస్తుంది.

గురువారం పాటించాల్సిన ముఖ్య పరిహారాలు:

గురువారం తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానం చేయాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇంటి పూజగదిలోని లక్ష్మీనారాయణస్వాములవారిని పూజించాలి. నెయ్యి దీపం కాలవ వత్తితో వెలిగించి, దానిలో కాస్త కుంకుమ వేసి ఆరాధన చేయాలి. ఇలా చేయడం వల్ల నారాయణుడు సంతోషించి, మీపై కరుణ చూపిస్తారు. శివుడి గురు స్వరూపమైన దక్షిణామూర్తి ఆరాధన కూడా మీకు సకల సంపదలను, శ్రేయస్సును తీసుకొస్తుంది.

విష్ణు చాలీసా , విష్ణు సహస్రనామ పఠనం

గురువారం రోజున విష్ణు చాలీసా , విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. దీనివలన మీరు, కుటుంబ సభ్యులపై శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉదయం స్నానానికి తరువాత పూజగదిని గంగాజలంతో శుభ్రం చేసి, కుశాసనంపై కూర్చొని పఠనం చేయడం మంచిది. పసుపు, పండ్లు, మిఠాయిలతో నైవేద్యం శ్రీ మహావిష్ణువుకు పసుపు ఇష్టమే. పఠనం తర్వాత పసుపు రంగులో పదార్థాలు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండు, బొప్పాయి వంటి పండ్లను అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.

కుంకుమ పూజ..

గురువారం లక్ష్మీనారాయణులకు కుంకుమతో పూజలు చేయడం ద్వారా గ్రహ పరిస్థితి మెరుగవుతుంది. రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమ కలిపి తాగడం లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం మంచిది. తర్వాత కుటుంబ సభ్యులందరితో ప్రసాదం పంచుకోవాలి. దీని వల్ల కుటుంబంలో సుఖ, ఆనందాలు పెరుగుతాయి.

గురువు – దానం

మీకు సన్నిహితమైన ఆధ్యాత్మిక గురువు ఉంటే, వారిని కలవడం, పాదాలకు నమస్కరించడం, ఏవైనా దానాలు లేదా బహుమతులు సమర్పించడం మంచిది. ఇలాగే చేయడం వల్ల జీవితంలో శుభం, పురోగతి, మేలిమి ఫలితాలు పొందవచ్చు. ఈ విధంగా పాటిస్తే గురువారం బృహస్పతి స్థానం బలపడుతుంది, మరియు ఆధ్యాత్మిక, ఆర్థిక, కుటుంబ, వ్యక్తిత్వ అభివృద్ధిలో సానుకూల ఫలితాలు లభిస్తాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..