Warangal: వరంగల్‌లో గుండెపోటుతో వివాహిత మృతి! జపాన్‌ నుంచి వచ్చిన వారం రోజులకే..

వరంగల్‌కు చెందిన ఓ వివాహిత జపాన్‌ నుంచి వచ్చిన వారం రోజులకే గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన మండలంలోని చిన్నముప్పారంలో మంగళవారం (ఏప్రిల్ 18) చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Warangal: వరంగల్‌లో గుండెపోటుతో వివాహిత మృతి! జపాన్‌ నుంచి వచ్చిన వారం రోజులకే..
Heart Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 20, 2023 | 1:07 PM

వరంగల్‌కు చెందిన ఓ వివాహిత జపాన్‌ నుంచి వచ్చిన వారం రోజులకే గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన మండలంలోని చిన్నముప్పారంలో మంగళవారం (ఏప్రిల్ 18) చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చిన్నముప్పారం గ్రామానికి చెందిన కదిర రాకేష్‌, సృజన (32) దంపతులు. వీరు గత కొన్నేళ్లుగా జపాన్‌లో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడే స్థిరపడ్డారు కూడా. ఈ క్రమంలో సృజనకు కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభయ్యాయి. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తెలంగాణలోని బంధువుల ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం జపాన్‌ నుంచి వచ్చిన సృజన వరంగల్‌లో తన బంధువుల ద్వారా రోహిణి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

ఐతే మంగళవారం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో సృజన మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి 5 ఏళ్ల కూతురు ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారం రోజులకే మరణించడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో 8 ఏళ్ల పిల్లల నుంచి వయసుతో సంబంధంలేకుండా అన్ని వయసుల వారు ఆకస్మిక గుండె పోటుతో మృతి చెందుతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.