Mango Peel: తొక్కే కదా అని విసిరిపారేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే ఎన్నటికీ ఆపని చేయరు..
వేసవిలో మామిడి పండ్లు తిననివారుండరేమో. సాధారణంగా మామిడి పండ్లను తిని పైన ఉండే తొక్కను పారేస్తుంటాం. ఇకపై అలా చేయవద్దంటున్నారు సౌందర్య నిపుణులు. మామిడి పండులోని పోషకాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఐతే మామిడి తొక్కలో కూడా ఎన్నో..
వేసవిలో మామిడి పండ్లు తిననివారుండరేమో. సాధారణంగా మామిడి పండ్లను తిని పైన ఉండే తొక్కను పారేస్తుంటాం. ఇకపై అలా చేయవద్దంటున్నారు సౌందర్య నిపుణులు. మామిడి పండులోని పోషకాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఐతే మామిడి తొక్కలో కూడా ఎన్నో పోషకాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి తొక్క చర్మ సంరక్షణలో ఎంతో మేలు చేస్తుంది. మామిడి తొక్కలో విటమిన్ సి చర్మం మెరిసిపోయేలా చేసి, యవ్వనంగా మార్చే గుణం కలిగి ఉంటుందట. మామిడిపండు తొక్కను క్రమం తప్పకుండా చర్మంపై మర్దనా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోవడమేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మామిడి తొక్కలో ఉండే తేమ చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
యాంటీ ఏజింగ్
మామిడి తొక్కలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది చిన్న వయసులోనే వృద్ధాప్య సంకేతాలను దరిచేరకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
మామిడి తొక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మంపై మొటిమలు పెరగకుండా నిరోధిస్తాయి. మొటిమల కారణంగా ముఖంపై ఎర్పడే నల్లటి మచ్చలు, వాపులను తొలగించడంలో సహాయపడుతుంది.
ఎక్స్‌ఫోలియేట్
మామిడి తొక్కలో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మంలోని మృతకణాలు తొలగించి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.