AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: ఉల్లి రైతు కంట కన్నీరు.. గత ఐదేళ్లలో కనీవినని రీతిలో కనిష్ఠానికి పడిపోయిన ఉల్లి ధరలు

గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ సంక్షోభం కారణంగా దేశంలో మరోసారి ఉల్లి ధరలు భారీగా..

Onion Price: ఉల్లి రైతు కంట కన్నీరు.. గత ఐదేళ్లలో కనీవినని రీతిలో కనిష్ఠానికి పడిపోయిన ఉల్లి ధరలు
Onion Price
Srilakshmi C
|

Updated on: Apr 19, 2023 | 12:09 PM

Share

గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ సంక్షోభం కారణంగా దేశంలో మరోసారి ఉల్లి ధరలు భారీగా పతనమవుతున్నాయి. చాలా చోట్ల రైతులు ఉల్లిని అతి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. దీంతో భారత్‌లో ఉల్లి ధరలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కనీసం పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో ఉల్లి రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు.

దేశంలో మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 40 శాతం మహారాష్ట్రలోనే ఉత్పత్తి అవుతోంది. మార్చిలో కురిసిన వర్షాలు, వడగళ్ల వాన కారణంగా పలుచోట్ల ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉల్లి నాణ్యత కొరవడడంతో అసలు ధర కంటే చాలా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారు. వానవల్ల ఉల్లి దెబ్బతినడంతో ఎక్కువకాలం నిల్వ చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో వీలైనంత త్వరగా విక్రయించేందుకు రైతులు పెద్దఎత్తున మార్కెట్లకు చేరుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో ఉల్లి నిల్వలు ఒక్కసారిగా పెరిగి ఉల్లి ధర పతనమైంది. నాణ్యత లేని ఉల్లిని నాలుగైదు నెలల పాటు రైతులు నిల్వ చేసుకుంటే కిలో ఉల్లి ధర రూ.15 వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఫలితంగా రెట్టింపు నష్టం వస్తుంది.

నాసిక్ మార్కెట్‌లకు ప్రతిరోజూ 24,000 టన్నుల ఉల్లిపాయలను రైతులు తీసుకువస్తున్నట్లు నివేదిక తెల్పుతోంది. మొత్తం 70 శాతం పంటలు దెబ్బతిన్నాయి. ఉల్లి పంటకు మార్చి నుంచి మే మధ్య మార్కెట్‌ బాగా ఉంటుంది. సాధారణంగా నాణ్యమైన ఉల్లి క్వింటాల్‌ ధర 500 నుంచి 600 రూపాయలు పలుకుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 రూపాయలు అంటే సగం ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.