TS Summer Effect: వామ్మో..! ఎండ దాటికి హన్మకొండలో పూర్తిగా దగ్ధమైన కారు.. స్థానికుల పరుగులు

రోహిణి కార్తెలో రోకళ్లు పగులుడేమోగానీ హన్మకొండ జిల్లా కాకాజీ కాలనీలో ఎండల దాటికి ఓ కారు దగ్ధమైంది. చెల్పూరుకు చెందిన కొలుగూరి శ్రీనివాస రావు అనే వ్యక్తి హాస్పటిల్ పని నిమిత్తం తన కారులో సిటీకి బయల్దేరాడు. రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి..

TS Summer Effect: వామ్మో..! ఎండ దాటికి హన్మకొండలో పూర్తిగా దగ్ధమైన కారు.. స్థానికుల పరుగులు
Summer Effect In Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2023 | 12:03 PM

రోహిణి కార్తెలో రోకళ్లు పగులుడేమోగానీ హన్మకొండ జిల్లా కాకాజీ కాలనీలో ఎండల దాటికి ఓ కారు దగ్ధమైంది. చెల్పూరుకు చెందిన కొలుగూరి శ్రీనివాస రావు అనే వ్యక్తి హాస్పటిల్ పని నిమిత్తం తన కారులో సిటీకి బయల్దేరాడు. రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి హాస్పిటల్‌లోకి వెళ్లాడు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి కారులో మంటలు చెలరేగడం కనిపించాయి. అప్పటికే కారు సగానికి పైగా కాలిపోయింది కూడా. స్థానికులు నీళ్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. దీంతో కొద్ది సమయం పాటు ఆ ప్రాంతంలో గందగోళ పరిస్థితి నెలకొంది.

కాగా ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి బానుడి ప్రతాపం ఊపందుకుంటోంది. బయటికి రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ, నిర్మల్ తదితర 7 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావారణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 44.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లా కట్టంగూరు, ఆసీఫాబాద్‌ జిల్లా జంబుగల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా ఎండ తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ఇందుకు కారణం ఓజోన్ పొర కరుగుతుండటం వల్లనేనని, సూర్యుడినుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరడంతో రేడియేషన్ పెరుగుతుందని నిపుణులంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.