Most Populous Country: జనాభాలో మనమే తోపులం.. చైనాను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో భారత్

స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 పేరుతో ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన జనాభా డేటా ప్రకారం.. భారతదేశ జనాభా 142.86 కోట్ల మంది ఉన్నారని.. అదే సమయంలో  చైనాలో జనాభా 142.57 కోట్ల మంది అని తెలుస్తోంది. అయితే చైనా పాపులేషన్ ను  భారత్‌ ఎప్పుడు అధిగమించిందనేది స్పష్టం చేయలేదు.

Most Populous Country: జనాభాలో మనమే తోపులం.. చైనాను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో భారత్
India To Be Most Populous Country
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2023 | 1:38 PM

భారత దేశం అత్యధిక జనాభాతో చైనాను బీట్ చేసి నెంబర్ వన్ గా అవతరించింది.  ఇదే విషయాన్నీ ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మధ్యలో 29 లక్షల జనాభాతో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు తెలుస్తోంది.

స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌, 2023 (State of World Population Report, 2023) పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (UNFPA) నివేదికను విడుదల చేసింది. దీనిప్రకారం భారత్‌లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పేర్కొన్నది. చైనా జనాభా “స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 పేరుతో ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన జనాభా డేటా ప్రకారం.. భారతదేశ జనాభా 142.86 కోట్ల మంది ఉన్నారని.. అదే సమయంలో  చైనాలో జనాభా 142.57 కోట్ల మంది అని తెలుస్తోంది. అయితే చైనా పాపులేషన్ ను  భారత్‌ ఎప్పుడు అధిగమించిందనేది స్పష్టం చేయలేదు. 2023 ఫిబ్రవరి వరకూ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక భారత్, చైనా ల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ అమెరికా మూడవ స్థానంలో ఉన్నట్లు డేటా నివేదికగా ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనాభా భారత్, చైనా ఈ రెండు దేశాల్లోనే ఉన్నదని వెల్లడించింది. అయితే రెండు ఆసియా దిగ్గజ దేశాల్లో జనాభా పెరుగుదల మందగిస్తోందని పేర్కొంది. ఇది భారతదేశంలో కంటే చైనాలో చాలా వేగంగా ఉంది. గత సంవత్సరం.. చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా దారుణంగా పడిపోయిందని తెలిపింది. ఇది ఒక చారిత్రాత్మక మలుపని.. జనాభా తగ్గుదల ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. అంతేకాదు చైనా జనాభా తగ్గుతూ వచ్చిందని అదే సమయంలో భారత్ లో పెరుగుతోందని వెల్లడించింది. గత ఆరు దశాబ్దాలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..