AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: గ్లాసుడు పాలల్లో స్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే..

రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఏ కాలంలోనైనా రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఐతే నేటి జీవనశైలి, ఆహార అలవాట్ల మూలంగా ప్రతి చిన్న విషయానికే ఆసుపత్రికి పరుగులు తీయటం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇమ్యునిటీ (రోగనిరోధకత) పెంచుకోవడానికి పెద్దగా ఖర్చుపెట్టవల్సిన అవసరం..

Immunity Booster: గ్లాసుడు పాలల్లో స్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే..
Immunity Booster
Srilakshmi C
|

Updated on: Apr 19, 2023 | 12:46 PM

Share

రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఏ కాలంలోనైనా రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఐతే నేటి జీవనశైలి, ఆహార అలవాట్ల మూలంగా ప్రతి చిన్న విషయానికే ఆసుపత్రికి పరుగులు తీయటం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇమ్యునిటీ (రోగనిరోధకత) పెంచుకోవడానికి పెద్దగా ఖర్చుపెట్టవల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే ఈ మూడు పదార్ధాలతో చిటికెలో ఇమ్మునిటీ పెంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. సంపూర్ణ ఆహారంగా పిలిచే పాలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ గ్లాసుడు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. పాలలో స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి చిటికెడు కలుపుకుని రోజూ తాగితే రోగాలు దరి చేరవు. రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో లాభాలు..

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ మాయం అవుతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి చక్కని పరిష్కారం. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి చక్కని ఉపశమనం అందిస్తుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటే రక్తం ప్రవహించే సిరల్లో కొవ్వు గడ్డకట్టే అవకాశం ఉంటుంది. పాలలో దాల్చిన చెక్క, తేనె కలుపుకుని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ పాలు దివ్యౌషధంలా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు ఎముకలను బలపరిచి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.