AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌.. కాసేపటికే బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య..

బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన మెసేజ్‌లు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి..

'నేను డేంజర్‌లో ఉన్నా' బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌.. కాసేపటికే బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య..
3 Women Murdered In Beach
Srilakshmi C
|

Updated on: Apr 19, 2023 | 11:45 AM

Share

బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో వీరు పెట్టిన మెసేజ్‌లు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్‌లో ఉన్నామని, రక్షించండంటూ మెసేజ్‌లు పంపిన కాసేపటికే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అగంతకులు ముగ్గురి యువతుల గొంతులు కోసి.. చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఓ బీచ్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22) అనే ముగ్గురు యువతులు సరదాగా గడిపేందుకు ఏప్రిల్ 4న ఈక్వెడార్‌లోని ఓబీచ్‌కు వెళ్లారు. ఐతే ఏం జరిగిందో తెలియదుగానీ బీచ్‌ ఒడ్డున కొందరు దుండగులు ముగ్గురు యువతులను వెంబడించి చాలా దూరం తరమారు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన యువతులు తాము ప్రమాదంలో ఉన్నామని తెల్పుతూ సన్నిహితులకు వేర్వేరే మెసేస్ లు పంపారు. నయేలి తన సోదరుడికి రాత్రి 11:10 గంటలకు వాట్సప్ మెసేజ్ పంపింది. ఐతే సోదరుడు వెంటనే ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు ‘నాకేదో ప్రమాదం జరగబోతుంది.. ఒకవేళ నాకేదైనా జరిగితే, గుర్తుంచుకో ఐ లవ్‌ యూ వెరీ మచ్‌’ అని మెసేజ్ పంపింది. ఈ తర్వాత రోజే వారు బీచ్‌లో అర్ధనగ్నంగా శవాలైతేలారు. గుర్తుతెలియని వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హతమార్చి, ఇసుకలో పూడ్చి పెట్టారు. ఏప్రిల్ 5న చేపలవేటకు వెళ్లిన జాలర్ల కుక్క బీచ్‌లో ఓ చోట కాళ్లతో తవ్వడం ప్రారంభించింది. అక్కడకు వెళ్లి చూడగా ముగ్గురి యువతుల శవాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్యలు ఎవరు చేసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతుల్లో ఒకరైన నయేలికి వివాహమై ఓ బిడ్డకు తల్లి. ఆమె ఫేమస్‌ సింగర్‌ కూడా. ఇక యులియానా మాసియస్ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్ధి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.