Door Bell: మరీ ఇలా కూడా ఉంటారా.. ఇంటి డోర్ బెల్ నొక్కినందుకు కాల్పులు జరిపిన యజమాని..చివరికి
అమెరికాలో కాన్సన్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంటి డోర్ బెల్‌ను రెండుసార్లు మోగించాడని ఆ ఇంటియజమాని కోపంతో అతనిపై కాల్పులు జరపడం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే కాన్సాస్ కు చెందిన రాల్ఫ్ యార్ల (16) అనే నల్లజాతీ యువకుడు తన కవల సోదరులను తీసుకెళ్లేందుకు ఆ ప్రాంతంలోని ఓ ఇంటికి వెళ్లాడు.
అమెరికాలో కాన్సన్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంటి డోర్ బెల్‌ను రెండుసార్లు మోగించాడని ఆ ఇంటియజమాని కోపంతో అతనిపై కాల్పులు జరపడం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే కాన్సాస్ కు చెందిన రాల్ఫ్ యార్ల్ (16) అనే నల్లజాతీ యువకుడు తన కవల సోదరులను తీసుకెళ్లేందుకు ఆ ప్రాంతంలోని ఓ ఇంటికి వెళ్లాడు. కానీ అది వాళ్ల సోదరులు ఇల్లు కాదన్న విషయం రాల్ఫ్ కు తెలియదు. దీంతో పొరపాటున ఆ ఇంటికి వెళ్లి బయట ఉన్న డోర్ బెల్ ను రెండు సార్లు మోగించాడు. అంతే ఆ ఇంటి యజమానికి ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో తలుపులు తెరిచి రాల్ఫ పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
దీంతో రాల్ఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతని పరిస్థితి విషమంగా ఉంది. అయితే రాల్ఫ్ పై కాల్పులు జరిపిన నిందితుడు ఆండ్రూ లెస్టర్ (85) ను పోలీసులు అదుపులోకి అరెస్టు చేశారు. 24 గంటల విచారణ తర్వాత అతడ్ని విడుదల చేశారు. నిందితుడ్ని విడుదల చేయండంపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆండ్రూ లెస్టర్ ఇంటి ముందే ఎత్త ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యాక్షురాలు కమలా సైరల్ లు కూడా స్పందించారు. బైడెన్ రాల్ఫ్ తో ఫోన్లో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..