Congress: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఆస్తులెన్నో తెలుసా..? లెక్కలు తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!
కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయం రంజుగా సాగుతోంది. ఓ వైపు నేతల ఎన్నికల ప్రచారం.. మరోవైపు నామినేషన్ల పర్వం. వెరసి కన్నడనాట ఎన్నికల వేడి పీక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కీలక నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు.
కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయం రంజుగా సాగుతోంది. ఓ వైపు నేతల ఎన్నికల ప్రచారం.. మరోవైపు నామినేషన్ల పర్వం. వెరసి కన్నడనాట ఎన్నికల వేడి పీక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కీలక నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. భారీ ర్యాలీలతో, జన సందోహంతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా కర్ణాకట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
డీకే శివకుమార్ వెల్లడించిన ఆస్తుల వివరాలివే..
డీకే శివకుమార్, ఆయన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 1,414 కోట్లు. ఇందులో ఆయన ఒక్కడి పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ. 1,214 కోట్లు కాగా, ఆయన భార్య ఉషా శివకుమార్ పేరిట రూ. 153.3 కోట్లు, ఉమ్మడి కుటుంబం ఆస్తుల విలువ రూ. 61 కోట్లు ఉంది. ఇక శివకుమార్ అప్పులు రూ. 226 కోట్లు. ఆయన భార్య పేరిట రూ. 34 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇలా డీకే శివకుమార్ తన కుటుంబం ఆదాయం, వ్యవసాయం, అద్దె ఆదాయం, వివిధ సంస్థలు, స్టాక్స్, బంగారం, వెండి ఇతర అన్ని వివరాలను వెల్లడించారు.
విలువైన వాచ్‌లు, కళ్లు చెదిరే బంగారం..
డీకే శివకుమార్ వద్ద హబ్లాట్, రోలెక్స్ వాచీలు ఉన్నాయి. వాటి విలువ రూ. 23 లక్షలు, రూ. 9 లక్షలుగా పేర్కొన్నారు. ఇక కేపీసీసీ వద్ద భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. 2.184 కేజీల బంగారం, 12.6 కేజీల వెండి, 1.066 కేజీల బంగారు ఆభరణాలు, 324 గ్రాముల వజ్రం, 24 గ్రాముల కెంపులు, 195 గ్రాముల మరో వజ్రం, 87 గ్రాముల రూబీ ఉన్నాయి. ఇంకా ఆయన భార్య పేరిట రూ 2.600 కిలోల బంగారం, 20 కిలోల వెండి ఉందని పేర్కొన్నారు. ఇక కుటుంబం మొత్తంగా రూ. 10 కిలోల వెండి, కిలో బంగారం ఉన్నట్లులో నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు డీకే శివకుమార్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..