AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హైడ్రామా.. ఎన్సీపీలో అజిత్‌పవార్‌ తిరుగుబాటుపై ప్రచారం.. లేదంటున్న..

బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ . ఎన్సీపీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అజిత్‌పవార్‌ 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హైడ్రామా.. ఎన్సీపీలో అజిత్‌పవార్‌ తిరుగుబాటుపై ప్రచారం.. లేదంటున్న..
Ajit Pawar
Sanjay Kasula
|

Updated on: Apr 18, 2023 | 8:29 PM

Share

మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హైడ్రామా నడుస్తోంది. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌పవార్‌ పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు అజిత్‌పవార్‌ . ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారడం లేదని , ఎన్సీపీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్ర నిజం లేదన్నారు అజిత్‌పవార్‌. ప్రతి మంగళ, బుధవారం ఎన్సీపీ ఎమ్మెల్యేలతో తానే భేటీ అవుతానని అన్నారు . దీనిని తప్పుగా ఊహించుకొని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అజిత్‌ పవార్‌ బీజేపీతో టచ్‌ లోకి వచ్చారని , మహారాష్ట్రలో 2019 పరిణామాలు రిపీట్‌ అవుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఖండించారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌. అజిత్‌ పవార్‌ ఎన్సీపీ లోనే కొనసాగుతారని తెలిపారు. పార్టీ మారుతారన్న ఊహాగానాలకు చెక్‌ పెడుతూ అజిత్‌పవార్‌ ఎన్సీపీ నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు.

త్వరలో షిండే కూటమి లోని 17 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడుతుందని . అందుకే ముందుజాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీని వీడారనే ఊహాగానాలు ఎందుకు?

నరేంద్ర మోడీ ప్రశంసలు, ఫడ్నవీస్‌ను కలవడం –

  • అజిత్ పవార్ గతంలో తన ప్రకటనతో చాలాసార్లు వార్తల్లో ఉన్నారు. ప్రధాని డిగ్రీ వివాదంపై, నరేంద్ర మోదీకి తన సొంత ఆకర్షణ ఉందని, అతను ప్రజలచే ఎన్నుకోబడలేదని అన్నారు. అతని డిగ్రీ ఆధారంగా. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను అజిత్ పవార్ కలిశారనే ప్రకటనతో రాజకీయ దుమారం ఆగలేదు. అజిత్ పవార్ ఈ సమావేశం రైతులకు మంచిదని అభివర్ణించారు. అయితే రాజకీయ వర్గాల్లో దీనికి భిన్నమైన అర్థాలు వచ్చాయి.
  • అజిత్ పవార్ ఇక్కడితో ఆగలేదని, షిండే వర్గంపై సుప్రీంకోర్టు రానున్న నిర్ణయాలపై నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పడిపోదని జోస్యం చెప్పారు. షిండేకు అనుకూలంగా తీర్పు రాకపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోదన్నారు.
  •  సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్సీపీ జెండా తొలగింపు- అజిత్ పవార్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్సీపీ జెండాను తొలగించారు. పవార్ ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీ కవర్‌పై ఎన్‌సిపి జెండా ఫోటో ఉంది.
  • అజిత్ పవార్ ఎన్‌సిపిని వీడారనే ఊహాగానాలకు ఇది కూడా కారణమని భావిస్తున్నారు. ఇక్కడ, అజిత్ పవార్‌కు సన్నిహితుడైన ధనంజయ్ ముండే రాష్ట్ర ప్రభుత్వ మంత్రిని కలవడానికి వెళ్ళాడు. ముండే, మంత్రి భేటీ తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us