Congress Caste Census: కుల గణనపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి.. నాడు అలా.. నేడు ఇలా..
కుల గణన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ వ్యాప్తంగా కుల గణన ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రధాని మోదీనిపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే పార్టీ రెండు విధానాలతో గేమ్స్ ఆడుతోందంటూ మండిపడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.

కుల గణన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ వ్యాప్తంగా కుల గణన ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రధాని మోదీనిపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే పార్టీ రెండు విధానాలతో గేమ్స్ ఆడుతోందంటూ మండిపడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. రాహుల్ ఏ అంశాన్నైతే లేవనెత్తారో.. అదే అంశాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమని తేల్చి పడేసింది. అప్పుడు అసాధ్యమన్న కాంగ్రెస్.. ఇప్పుడు సాధ్యం ఎందుకు కాదంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటూ ధ్వజమెత్తుతున్నారు విపక్ష నేతలు. ఇందుకు కొన్ని ఉదాహరణగా గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన కామెంట్స్‌ని చూపుతున్నారు.
నేహ్రూ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కుల గణనపై కాంగ్రెస్ నేతలు ఏం కామెంట్స్ చేశారో, ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జవహర్‌లాల్ నెహ్రూ: జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1951లో మొదటిసారిగా కుల ఆధారిత జనాభా గణన గురించి అనధికారికంగా చర్చించారు. దేశంలో కుల ప్రాతిపదికన జనాభా గణన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
2. ఇందిరా గాంధీ: నెహ్రూ తరువాత ఇందిరా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుల గణనపై మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను పక్కకు పడేశారు. కుల గణన అవసరం లేదని నిర్ణయించారు.




3. రాజీవ్ గాంధీ కూడా ఇందిరా గాంధీనే ఫాలో అయ్యారు. మండల్ కమిషన్‌ను ‘క్యాన్ ఆఫ్ వార్మ్స్’ అని అభివర్ణించాడు. ఇది దేశాన్ని విభజించే అంశంగా పేర్కొన్నారు.
4. 2010లో కుల గణన అంశంపై మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందం కుల గణనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మంత్రుల బృందం కూడా కుల గణనకు వ్యతిరేకంగా ఉందని. ఆ తరువాత కొద్ది రోజులకే కుల గణన అసాధ్యమైనదని పార్లమెంట్ వేదికగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రమాకరమైన పరిణామాలకు దారి తీస్తుందని నాటి మంత్రుల బృందం అభిప్రాయపడింది. కులం ఆధారంగా సమాజంలో విభజనకు కారణం అవుతుందని, ఆ నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇలా అనేక సందర్భాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి నిర్వహించిన పి. చిదంబరం, ప్రణమ్ బుఖర్జీ, అజయ్ మాకేన్, ఆనంద్ శర్మ, వీరప్ప మొయిలీ సహా చాలా మంది కుల గణనపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కుల గణన సాధ్యపడదని తేల్చి చెప్పారు.
అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు ‘మండల్ కమిషన్’ రిపోర్ట్ ప్రకారం కుల గుణన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ వెనుక వారి వారి రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అదే అంశంతో కుల గణనపై వెనక్కి తగ్గుతోంది. ఇక ఇన్నాళ్లూ కుల గణనను వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం.. ఇప్పుడెందుకు ఉత్సుకత ప్రదర్శిస్తుందనేది అర్థం కావడం లేదని ఆ పార్టీలోని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. నాడు వద్దు అని, నేడు కుల గణన చేపట్టాలని డిమాండ్ చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




