- Telugu News Photo Gallery Akshaya tritiya 2023 five prasad or foods of milk to worship of goddess laxmi devi
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున నైవేద్యం కోసం పాలతో ఈ పదార్దాలను తయారు చేసుకోండి.. ఈజీ కూడా
సనాతన ధర్మంలో కాలానుగుణంగా పండుగలు ఖచ్చితంగా వస్తాయి. ప్రతి సీజన్‌కు అనుగుణంగా వేడుకలు విభిన్నమైన ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజు లక్ష్మీదేవి, విష్ణువుకు సంబంధించినదని విశ్వాసం. అక్షయ అంటే 'అంతం లేనిది' .. తృతీయ 'శాశ్వతమైన శ్రేయస్సుకి చెందిన మూడవ రోజు' అని అర్ధం. దీంతో అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకుంటారు.
Updated on: Apr 19, 2023 | 12:25 PM

ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అందుకే ప్రజలు ఈ రోజు శుభకార్యాలను ప్రారంభిస్తారు. ఈ రోజున విష్ణువుకి పాలతో చేసిన కొన్ని వస్తువులను సమర్పిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి, విష్ణువుకి సమర్పించడానికి ఈజీగా తయారు చేసుకునే పదార్ధాల గురించి తెలుసుకుందాం..

పాయసం : అక్షయ తృతీయ శ్రేయస్సుకు చిహ్నం. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి బియ్యం, పాలతో ఖీర్ ను నైవేద్యంగా సమర్పించవచ్చు. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఇందులో చేర్చడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి.

రసమలై :పండగలు, పర్వదినాల్లో ప్రసాదంగా అందించే రసమలై భారతీయులకు ఇష్టమైన స్వీట్ కూడా. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. పనీర్, కుంకుమపువ్వు చక్కెర సిరప్, కుంకుమపువ్వు , పాలలో తయారు చేసే ఈ స్వీట్ రుచికరం. దేవుడికి సమర్పించే రసమలై ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఆమ్రస్: గుజరాత్, మహారాష్ట్రలలో అక్షయ తృతీయ రోజున ఆమ్రస్ ను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది రుచిలో అద్భుతమైనది. ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.

మామిడి పాయసం: ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఖీర్‌ను వేరే విధంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం పాలలో వండిన అన్నం, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో ప్యూరీ కలిపి మ్యాంగో ఖీర్ సిద్ధం చేసుకోవాలి. అందులో కొన్ని కుంకుమపువ్వు రేకలు వేయాలని గుర్తుంచుకోండి.