Double Decker Bus: సిటీలో ఖాళీగా తిరుగుతున్న డబుల్ డెక్కర్ బస్సులు! నో టికెట్‌.. ఫ్రీగానే..’చూస్తున్నారే తప్ప ఎవ్వరూ ఎక్కడం లేదు’

సిటిజన్లను బాగా ఆకర్షిస్తాయనుకున్న డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో ఖాళీగా తిరుగుతున్నాయి. అసలు ఈ బస్సులు ఉన్నాయా? లేదా? ఒకవేళ ఉంటే ఏయే రూట్లలో తిరుగుతున్నాయ్‌? వంటి సమాచారం నగర వాసులకు కరువైపోయింది. దీంతో వీటికి ఆదరణ కరువైపోయింది. ట్విన్‌ సిటీల్లో ఎన్నో ఏళ్ల క్రితమే డబుల్ డెక్కర్ బస్సులు సిటీకి ప్రత్యేకతను తెచ్చి..

Double Decker Bus: సిటీలో ఖాళీగా తిరుగుతున్న డబుల్ డెక్కర్ బస్సులు! నో టికెట్‌.. ఫ్రీగానే..'చూస్తున్నారే తప్ప ఎవ్వరూ ఎక్కడం లేదు'
Double Decker Bus
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 19, 2023 | 3:17 PM

సిటిజన్లను బాగా ఆకర్షిస్తాయనుకున్న డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో ఖాళీగా తిరుగుతున్నాయి. అసలు ఈ బస్సులు ఉన్నాయా? లేదా? ఒకవేళ ఉంటే ఏయే రూట్లలో తిరుగుతున్నాయ్‌? వంటి సమాచారం నగర వాసులకు కరువైపోయింది. దీంతో వీటికి ఆదరణ కరువైపోయింది. ట్విన్‌ సిటీల్లో ఎన్నో ఏళ్ల క్రితమే డబుల్ డెక్కర్ బస్సులు సిటీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. డబుల్​డెక్కర్‌ బస్సుల్లో కూర్చొని సిటీ అందాలు చూసేందుకు నగర వాసులు అప్పట్లో అమితాసక్తి కనబరిచేవారు. సిటీలో డబుల్​డెక్కర్​బస్సులను తిరిగి ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు నెటిజన్స్​నుంచి మంత్రి కేటీఆర్​కు రిక్వెస్ట్‌లు వెళ్లడంతో ఈ బస్సులను మళ్లీ రోడ్డెక్కించాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై లెక్కలు వేసుకున్న అధికారులు ప్రస్తుత సిటీ రూట్లలో వాటిని తిప్పడం సాధ్యం కాదని, బస్సుల ధర కూడా ఎక్కువని తేల్చారు. దాంతో ఈ బాధ్యత హెచ్‌ఎండీఏ తీసుకుంది. ఒక్కో డబుల్​డెక్కర్‌ను దాదాపు రూ.2 కోట్లు పెట్టి మొత్తం 6 బస్సులను రూ.12 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఒక్కో బస్‌​మెయింటెనెన్స్​కోసం నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తోంది.

ముందుగా రెండు బస్సులను నడిపిన హెచ్‌ఎండీఏ తర్వాత మరో నాలుగింటిని కొన్నది. నెక్లెస్​రోడ్, ఎన్టీఆర్​మార్గ్​ఏరియాల్లో గత రెండు నెలల కిందట సర్వీసులను ప్రారంభించింది కూడా. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రతి బస్సును రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. తొలుత టికెట్లు తీసుకోకుండా జాయ్ రైడ్​పేరిట ఫ్రీగానే తిప్పుతున్నప్పటికీ.. ప్రచారం లేకపోవడంలో ఈ విషయం తెలియని జనాలు వాటిని చూసి సంబురపడుతున్నారే తప్ప ఏ ఒక్కరూ ఎక్కడం లేదు. అటు అధికారుల్లోనూ ఈ బస్సుల రూట్​మ్యాప్, స్టేజీల విషయంలోనూ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ట్రయల్​రన్​చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన డబుల్​డెక్కర్‌ బస్సులు ఉసూరుమంటూ రోడ్లపై తిరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే