Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MMTS Services: హైదరాబాదీయులకు శుభవార్త.. నగరంలో అదనపు ఎమ్‌ఎమ్‌టీస్ సేవలు.. రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు..

హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల్లోని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలను మరింతగా పెంచింది. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి గమ్యస్థానాన్ని

MMTS Services: హైదరాబాదీయులకు శుభవార్త.. నగరంలో అదనపు ఎమ్‌ఎమ్‌టీస్ సేవలు.. రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు..
Mmts Trains
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 19, 2023 | 3:25 PM

MMTS Services: జంటనగరాలలోని ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల ప్రయాణికులకు శుభవార్త. ఇకపై హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల్లోని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలను మరింతగా పెంచింది. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి గమ్యస్థానాన్ని కూడా పొడిగించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు 20 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను అదనంగా కేటాయించింది దక్షిణ మధ్య రైల్వే. అలాగే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నూమా వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించింది. దీంతో జంటనగరాలలో నడిచే ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది.

సికింద్రాబాద్-మేడ్చల్‌ మార్గంలో అదనంగా 20 రైళ్లు

జంట నగరాల నుంచి మేడ్చల్‌కు రాకపోకలు జరుపుతున్న ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. దక్షిణ మధ్య రైళ్లే ఆ మార్గంలో 20 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను అదనంగా కేటాయింది. ఈ క్రమంలోనే 47231, 47222, 47233, 47224, 47235, 47226, 47237, 47228, 47239, 47230 నంబర్లు కలిగిన 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కి వచ్చేందుకు కేటాయించగా.. 47221, 47232, 47223, 47234, 47225, 47236, 47227, 47238, 47229, 47240 నంబర్లు కలిగిన మరో 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లేందుకు అదనంగా జోడించడం జరిగింది.

లింగంపల్లి-ఫలక్‌నూమా-ఉందానగర్‌ మార్గంలో ఎమ్‌ఎమ్‌టీఎస్ సేవలు పొడిగింపు

జంటనగరాల విస్తీర్ణం, అలాగే ఇక్కడను నిత్యం రాకపోకలు జరిపేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. లింగంపల్లి-ఫలక్‌నూమా మార్గంలో నడిచే రైళ్లను ఉందానగర్‌ వరకు పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ క్రమంలోనే 47213, 47173, 47176, 47178, 47212, 47181, 47210, 47190, 47159, 47194 నంబర్లు కలిగిన ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, ఫలక్‌నూమా ప్రాంతాల మీదుగా ఉందానగర్ వరకు పొడిగించింది. అలాగే 47151, 47153, 47154, 47211, 47165, 47157, 47214, 47160, 47164, 47203 నంబర్ల ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ఫలక్‌నూమా నుంచి కాకుండా ఉందానగర్ నుంచి లింగంపల్లికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..