Vastu Tips: కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా..? బాత్‌రూమ్‌లో ఈ నియమాలను పాటించకపోవడమే కారణం..!
జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మావన జీవితంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. నివసించే ఇంట్లో వాస్తు నియమాలు విరుద్ధంగా ఏ చిన్న వాస్తు లోపం ఉన్నా.. ఆ ఇంటివారికి..
Vastu Tips To Follow In Washroom: జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మావన జీవితంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. నివసించే ఇంట్లో వాస్తు నియమాలు విరుద్ధంగా ఏ చిన్న వాస్తు లోపం ఉన్నా.. ఆ ఇంటివారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాత్‌రూమ్ విషయంలో ఏ చిన్న వాస్తు లోపం ఉన్నా పూర్తి కుటుంబంపై దాని ప్రభావం పడుతుందని, అందువల్ల వాష్‌రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు. సహజంగానే చాలా మంది బాత్‌రూమ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇది మంచిది కాదని వాస్తు నిపుణుల హెచ్చరిక. మరి బాత్‌రూమ్‌లో ఏయే వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- బాత్‌రూమ్ అనేది ఇంటికి ఉత్తర దిశలో లేదా వాయవ్య దిక్కునే ఉండాలి. ఎప్పుడూ కూడా దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిశలలో ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- బాత్‌రూమ్‌లో ఉండే వాటర్ బకెట్‌ని ఎప్పుడూ కూడా నింపి ఉంచాలి. ఖాళీగా ఉంచాలని అనుకున్నట్లయితే దాన్ని బోర్లించి మాత్రమే పెట్టుకోవాలి.
- అద్దం ఎప్పుడూ కూాడా బాత్‌రూమ్ డోర్ ముందు ఉండనే ఉండకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్శించి, ఇబ్బందులకు దారితీస్తుంది.
- బాత్‌రూమ్ తలుపుని ఎప్పుడూ కూడా తెరిచి ఉంచకుండా మూసే ఉంచాలి. తెరిచి ఉంచితే ప్రతికూల శక్తుు ఇంట్లోని ప్రవేశిస్తాయి.
- బాత్‌రూమ్‌లోని ట్యాప్‌ల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాటిని ఎప్పుడూ లీక్ కాకుండా చూసుకోవడం మంచిది. లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది.
- మరీ ముఖ్యంగా బాత్ రూమ్‌కు మంచి వెంటిలేషన్ సౌకర్యం ఉండాలి. వెంటీలెటర్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉండాలి. అప్పుడే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది.
- అలాగే బాత్ రూమ్‌లో ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. టైల్స్ కానీ గోడల రంగులు కానీ లేత రంగులు ఎంచుకోవడం ఇంకా మంచిది. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..