‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’.. వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

చాలా మంది యువకులు బైక్ నడిపే సమయంలో తమని తాము హీరోలుగా భావిస్తుంటారు. ఇంకా బైక్‌పై స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. మరోవైపు బైక్ లేదా వాహనం నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. ఇదే తరహాలో తెలంగాణ..

‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’.. వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Young Boy Bike Stunts; Tsrtc Md Vc.sajjanar
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 18, 2023 | 8:54 PM

చాలా మంది యువకులు బైక్ నడిపే సమయంలో తమని తాము హీరోలుగా భావిస్తుంటారు. ఇంకా బైక్‌పై స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. మరోవైపు బైక్ లేదా వాహనం నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. ఇదే తరహాలో తెలంగాణ ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కూడా తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఓ రోడ్డు అక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేయగా, అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ట్రాఫిక్ నియమాలను విస్మరించడమే కాక మెయిన్ రోడ్డు మీదే బైక్‌పై చిల్లర వేషాలు వేసి ప్రమాదానికి గురయ్యాడు ఓ ప్రబుద్ధుడు. జాతకం బాగుండడంతో స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఇక వీడియో ప్రారంభంలో ఆ యువకుడు బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ, దాని వెనక్కు పడుకుని నడపడాన్ని కూడా మనం చూడవచ్చు. అలా నడుపుతూనే రోడ్డు పక్కనే ఉన్న షాప్‌లోకి దూసుకెళ్లడాన్ని మీరు గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువకుడిపై మండిపడుతున్నారు. ‘దీనికి తాగవాల్సిన అవసరం లేదు సార్, జనాలో మేము తోపు అనే ‘attitude’ చూపించుకోడానికి కూడ ఇది చేస్తారు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే ‘ఈడు పోతే పోయాడు అదే వెళ్లి వేరే ఎవరినైనా గుద్దితే ఏంటి పరిస్థితి’ అంటూ మరోకరు కామెంట్ చేశారు. ‘ఇలాంటి వాళ్లను హాస్పిటల్‌కి కాకుండా ఆ గాయాలతోనే జైలుకి తీసుకెళ్లాలి’ అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఇలా వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..