Weather Alert: బాబోయ్, ఏపీలో భగ్గుమంటున్న ఎండలు..! రానున్న 2 రోజుల్లో ఈ జిల్లాలకు తీవ్ర వడగాల్పులు..
మే నెల ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు మండలాలలో వడగాల్పులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. ఇక ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అంచనాల ప్రకారం బుధవారం
ఈ ఏడాది మే నెల ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు మండలాలలో వడగాల్పులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. ఇక ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని 98 మండలాల్లో వడగాల్పులు, గురువారం 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు(బుధవారం) మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. బుధవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 98 మండలాలు.
అలాగే గురువారం వడగాల్పుల ప్రభావానికి లోనయ్యే మండలాల వివరాలు వెల్లడించారు. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితాలో అల్లూరి జిల్లాకు చెందిన 7 మండలాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లిలో 16, తూర్పుగోదావరిలో 2, ఏలూరులో 2, గుంటూరులో 3, కాకినాడలో 10, కృష్ణాలో 2, ఎన్టీఆర్‌లో 8, పల్నాడులో 1, పార్వతీపురంమన్యంలో 12, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 19, వైఎస్ఆర్‌లో 10 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాగా, మంగళవారం అనకాపల్లిలో 17, కాకినాడలో 2, కృష్ణాలో 1, నంద్యాలలో 2, విశాఖలో 2, విజయనగరంలో 2, వైఎస్ఆర్‌లోని 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని మొత్తం 110 మండలాల్లో వడగాల్పులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..