Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Heritage Sites: ఒక్కసారైనా సందర్శించాల్సిన భారత వారసత్వ ప్రదేశాలు.. అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ‘అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవం’ అని కూడా అంటారు. ప్రపంచ సాంస్కృతిక, సహజ వారసత్వం గురించి తెలుసుకోవడానికి, విలువైన వాటి వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో.. ప్రతి ఏటా ఏప్రీల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే భారత్ వారసత్వ సంపద గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎన్నో అంతుచిక్కని రహస్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కపాడుకుంటూ వస్తోంది మన ప్రాచీనమైన భారతదేశం. మరి భారత్ వ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన పర్యాటక, వారసత్వ సంపదల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 18, 2023 | 3:38 PM

తాజ్ మహల్: ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ కూడా ఒకటి. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన, ఇంకా ఐకానిక్ స్మారక చిహ్నం ఇది. తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. ఇది మొఘల్ వాస్తుశిల్పానికి ఉత్తమ కళాఖండంగా పరిగణించబడుతుంది. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో తాజ్ మహల్ ఒకటి.

1 / 6
ఖజురహో స్మారక చిహ్నాలు: మధ్యప్రదేశ్‌లోని ఈ ఖజురహో ఆలయ స్మారక చిహ్నాలు.. దేవతలు, జంతువులు, సంగీతనృత్యకారులతో సహా ప్రాచీన భారతీయ జీవితం, సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి. 10వ శతాబ్దానికి చెందిన ఈ ఖజురహో అలయ అందాలను చూస్తే ‘అదరహో’ అనాల్సిందే. నగారా శైలి వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణగా చెప్పుకునే ఈ స్మారక చిహ్నాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

2 / 6
అజంతా, ఎల్లోరా గుహలు: మహారాష్ట్రలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందినవని పురావస్తు నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒకే కొండ రాయి నుంచి తొలచిన ఈ గుహలు.. దేవాలయాలు, మఠాలతో నిండి ఉంటాయి. ఈ గుహలు బౌద్ధ, హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించే విస్తృతమైన చేతి పెయింటింగ్‌లు, శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో అంజతా, ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి.

3 / 6
కుతుబ్ మినార్: భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నిర్మాణాలలో ఒకటి, అలాగే మన దేశంలో రెండవ ఎత్తైన మినార్‌. 72.5 మీటర్లు ఉన్న కుతుబ్ మినార్‌లో దాదాపు 379 మెట్లు ఉన్నాయి. ఇది భారతదేశ క్లిష్టమైన నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన ఈ నిర్మాణం.. ఇది అరబిక్, బ్రాహ్మీ శాసనాలతో అలంకరించబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఈ కుతుబ్ మినార్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.

4 / 6
హంపి స్మారక చిహ్నాలు: కర్ణాటకలోని హంపి స్మారక చిహ్నాలు ఒకప్పటి విజయనగర సామ్రాజ్యం రాజధాని అవశేషాలకు విస్తారమైన స్మారక చిహ్నం. ఈ హంపి స్మారక చిహ్నాల సముదాయాలలో విస్తృతమైన దేవాలయాలు, రాజభవనాలు, ఇతర నిర్మాణాలకు ఉంటాయి.ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కూడా పర్యాటకులు విస్తృతంగా వస్తుంటారు.

5 / 6
కోణార్క్ సూర్య దేవాలయం: కోణార్క్‌లోని సూర్య దేవాలయం శిల్పకళా అలంకరణకు ప్రత్యక్ష నిదర్శనం. భారత ఉపఖండానికి తూర్పు తీరంలో ఉన్న ఈ కోణార్క్ సూర్య దేవాలయం భారతీయ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి.

6 / 6
Follow us