- Telugu News Photo Gallery Best tourist attraction of the summer is Udupi Malpe Beach floating bridge
Udupi Malpe Beach: సముద్రపు నీటిపై తేలుతూ ఆడుకోవాలనుకుంటున్నారా.. అయితే ఉడుపిలో మల్పే బీచ్‌కు వెళ్లాల్సిందే..
అసలే వేసవి కాలం.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చాలా మంది హిల్ స్టేషన్లు, మంచుకొండలు, చల్లటి ప్రదేశాలకు వెళ్తుంటారు. మనసుని, శరీరాన్ని కాస్త చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంటారు.అసలే వేసవి కాలం.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చాలా మంది హిల్ స్టేషన్లు, మంచుకొండలు, చల్లటి ప్రదేశాలకు వెళ్తుంటారు.
Updated on: Apr 18, 2023 | 3:56 PM

అసలే వేసవి కాలం.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చాలా మంది హిల్ స్టేషన్లు, మంచుకొండలు, చల్లటి ప్రదేశాలకు వెళ్తుంటారు. మనసుని, శరీరాన్ని కాస్త చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంటారు.

అలాంటి వారి కోసం కర్నాటక ప్రభుత్వం ఓ సరికొత్త పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. చాలా మందికి సముద్రంలో తేలియాడాలని, అలలతో ఆడుకోవాలని ఉంటుంది.

అయితే ఈత రాకపోవడం, సముద్రం అంటే ఉన్న భయంతో ఎవరూ అందులోకి దిగేందుకు సాహసం చేయలేరు. అయితే అలాంటి వారి కోసం అద్భుత ఆలోచనతో ఓ బ్రిడ్జికి రూపకల్పన చేసింది కర్నాటకలోని పర్యాటకశాఖ.

కర్నాటక రాష్ట్రంలోనే తొలిసారి ఉడిపిలోని మల్పే బీచ్‌లో తేలియాడే వంతెనను నిర్మించింది. ఉడిపిలో పర్యాటకుల రద్దీని పెంచేందుకు ఈ వంతెన అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ముగ్గురు స్థానిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టారు.

80 లక్షల వ్యయంతో ఈ వంతెనను ఏర్పాటు చేశారు. దీని పొడవు 100 మీటర్లు. సందర్శకులు ఒక వ్యక్తి 100 రూపాయలు చెల్లించాలి. లైఫ్ జాకెట్ ధరించి ఈ వంతెనపై 15 నిమిషాల పాటు నడవవచ్చు.

సందర్శకుల భద్రత కోసం వంతెనపై 10 మంది లైఫ్ గార్డులు, 30 లైఫ్ బాయ్ రింగులు ఉంటాయి.వంతెనపై ఉన్నప్పుడు, సందర్శకుడు సముద్రపు అలల కదలికల అనుభూతి పొందుతాడు. వంతెనపై నడుస్తుంటే.. కెరటాల మీద స్వారీ చేసినట్లుగా ఉండటం దీని ప్రత్యేకత.





























