Telugu News Lifestyle Road Safety Tips For Pedestrian, which will keeps them safe check to know full details
Road Safety Tips: రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. తేడా వస్తే ప్రాణాలు గాల్లోనే..
Road Safety Tips For Pedestrian: ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికి సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ స్వీడ్‌తో వెళ్లేవారు కొందరైతే.. కాలినడకనే రోడ్లు దాటేస్తుండేవారు మరి కొందరు. ఎవరు ఎలా వెళ్లినా.. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే అందరూ
ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికి సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ స్పీడ్‌తో వెళ్లేవారు కొందరైతే.. కాలినడకనే రోడ్లు దాటేస్తుండేవారు మరి కొందరు. ఎవరు ఎలా వెళ్లినా.. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే అందరూ కూడా తమతమ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకోవచ్చు. లేకపోతే లేనిపోని ప్రమాదాలు తప్పవు. ముఖ్యంగా కాలినడకన రోడ్డుపై కనిపించే పాదచారులు అప్రమత్తంగా ఉంటాలి. ఎందుకంటే మెయిన్ రోడ్డుపై ప్రయాణించేవారిలో వారికే హై రిస్క్ ఉంటుంది. ఎలా అంటే.. చాలా మంది ఫోన్ మాట్లాడుతూ, ఎక్కడో ఆలోచిస్తూ, లేదా ఎక్కడున్నామనే విషయంపై ధ్యాస లేకుండా రోడ్లు దాటుతుంటారు. ఈ సమయాలలో వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. ‘హా.. ఏదో చెప్తారులే’ అని కొట్టేయకండి.. ఇంకా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి.. మీకే నమ్మకం కలుగుతుంది.
వీడియోలో చూశారు కదా.. తన పనిలో తాను నిమగ్నమైన వ్యక్తి రోడ్డును ఎలా దాటుతున్నాడో..! అతను ట్రాఫిక్ నియమాలు పాటించకపోయినా.. అతన్ని గమనించిన కార్‌లోని డ్రైవర్ వెంటనే తన వాహనాన్ని ఆపేశాడు. ఫలితంగా రోడ్డు దాటుతున్న వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అందువల్ల వారు రోడ్డు దాటే సమయంలో సబ్‌వేలు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలి. అలా కాకుడా షార్ట్ కట్ రోడ్డు అంటే వచ్చే వాహానాలను పట్టించుకోకుండా రోడ్డు దాటడం వంటివి చేయకూడదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై కాలిబాటన నడిచే పాదాచారుల కోసం ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక సూచనలను జారీ చేసింది. వాటిని పాటిస్తే చాలు.. సురక్షితంగా మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
రోడ్డు క్రాస్ చేసే పాదాచారుల పాటించవలసిన ట్రాఫిక్ సూచనలు లేదా జాగ్రత్తలు..
అన్ని వైపులా చూసి, సురక్షితమే అనుకుంటే రోడ్డును దాటండి.
మీరు నడుస్తున్న రోడ్డుపైకి వస్తున్న వాహనాలను గమనిాంచండి.. అవి లేనప్పుడు మాత్రమే రోడ్ క్రాస్ చేయండి.
మీరు రోడ్డు దాటబోతున్నప్పుడు డ్రైవర్ మిమ్మల్ని చూశారని లేదా చూస్తారని ఎప్పుడూ అనుకోకండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీ బాధ్యతే.
డ్రైవర్లు మిమ్మల్ని చూడలేని చోట రోడ్డు దాటడం మానుకోండి. లేదంటే ప్రమాదం తప్పదు.
డివైడర్ రెయిలింగ్‌లపై అంటే రోడ్డుకు మధ్య ఉండే డివైడర్‌పై నుంచి ఎప్పుడూ దూకవద్దు. అలా దూకితే ట్రాఫిక్‌లో పడిపోయే అవకాశం ఉంది.
మీతో పాటు ఉన్న పిల్లలతో సహా రోడ్డు దాటుతున్నప్పుడు వారి చేతులను ఎల్లప్పుడూ పట్టుకోండి.
మార్నింగ్ వాక్, జాగింగ్ కోసం రోడ్లను ఉపయోగించడం మానుకోండి.
మీరు రోడ్డు మలుపులపై లేదా హైవేలను దాటవలసి వస్తే అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
పార్క్ చేసిన కార్ల మధ్య నుంచి రోడ్డు దాటడం మానుకోండి.
ముఖ్యంగా జీబ్రా క్రాసింగ్ ఉన్న ప్రదేశాలలోనే రోడ్డు దాటండి.