Watch Video: స్టైల్ విషయంలో తగ్గేదేలే..! షూస్ వేసుకుని నెట్టింట తిరిగేస్తున్న ‘కోడిపుంజు’.. నెటిజన్లు స్పందన ఏమిటంటే..?

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలను చూస్తుంటే మనకు ఎక్కడా లేనంత సరదాగా ఉంటుంది. అయితే తాజాగా ఓ కోడి పుంజుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కోడి పుంజు కేవలం 4, 5 ఆడుగులు వేసింది. అదే ఎక్కువ అన్నట్లుగా కోడిపుంజు వీడియోపై

Watch Video: స్టైల్ విషయంలో తగ్గేదేలే..! షూస్ వేసుకుని నెట్టింట తిరిగేస్తున్న ‘కోడిపుంజు’.. నెటిజన్లు స్పందన ఏమిటంటే..?
Hen With Shoes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 14, 2023 | 1:33 PM

అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువుల, పక్షుల వీడియోలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. ఇక వాటిని చూస్తుంటే మనకు ఎక్కడా లేనంత సరదాగా ఉంటుంది. అయితే తాజాగా ఓ కోడి పుంజుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కోడి పుంజు కేవలం 4, 5 ఆడుగులు వేసింది. అదే ఎక్కువ అన్నట్లుగా కోడిపుంజు వీడియోపై నెటిజన్లు లైకులు వర్షం, వీక్షణల వరద పారేలా స్పందిస్తున్నారు. కోడి పుంజు నడిస్తే ఇంత హడావుడి అవసరమా అనకండి.. అసలు విషయం ఆ కోడి పుంజు నడకలోనే ఉంది.

అసలు ఆ వీడియోలో ఏముందంటే..?  ఓ కోడిపుంజు తన రెండు కాళ్లకు బెల్ట్ చెప్పులు వేసుకుని నడుస్తుంటుంది. ఇక అది నడిచే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మోడల్ మోడల్ సూపర్ మోడల్’ అనే సాంగ్ కూడా వినిపిస్తుంది. అయితే crazy_tr0ller అనే ఖాతా నుంచి పోస్ట్ అయింది ఈ వీడియో. వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వుసుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న మోడల్ కోడిపుంజు వీడియోను ఇక్కడ చూడండి..

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు తమదైన శైలిలో సరదా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వారిలోనే ఒక నెటిజన్ అయితే ‘కోడి మోడల్ అంటర్రా బాబు..’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘ఈ మోడల్‌తో మాములుగా ఉండద’ని సరదాగా రాసుకొచ్చారు. అలా ఈ వీడియోపై నెటిజన్లు ఎందరో తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 79 వేల లైకులు, 32 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..