AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: ఈ 4 సిపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.. మీ నుంచి ‘హార్ట్ ఎటాక్’ ఆమడ దూరం పోతుంది..

చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్న ఘటనలు మన చుట్టూనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం గుండెను..

Heart Health: ఈ 4 సిపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.. మీ నుంచి ‘హార్ట్ ఎటాక్’ ఆమడ దూరం పోతుంది..
heart Health Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 14, 2023 | 11:40 AM

Share

Heart Health Tips: ప్రపంచ మానవాళి వణిికిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు లేదా హృదయ సంబంధ సమస్యలదే ప్రథమ స్థానం. ఇక చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్న ఘటనలు మన చుట్టూనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం గుండెను ఎంతగా కాపాడుకుంటే.. మనం అంతకాలం ఎక్కువగా బతకగలుగుతాం. అయితే గుండెను కాపాడుకునేందుకు  కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయపాలన లేని ఆహారపు అలవాట్లను, క్రమరహిత జీవనశైలిని వదిలేయాలి. అలాగే కొన్ని రకాల కొత్త అలవాట్లను కూడా నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి నిపుణుల ప్రకారం గుండెను కాపాడుకునేందుకు ఏయే పద్దతులను పాటించాలో ఇప్పుడు చూద్దాం..

వ్యాయామం: ప్రస్తుత కాలంలో మన ఉద్యోగానికి మతి అవసరమే కానీ శరీరం కాదు. అలా అని ఏ పని చేయకుండా ఉండడం మనం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే శరీరానికి శ్రమ తప్పనిసరి. పెద్ద పెద్ద పనులు కాకపోయినా.. ఇంట్లోనే చిన్న చిన్న పనులలో అయినా చేయి వేయాలి. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. లేదా వాకింగ్, రన్నింగ్ వంటివి కూడా పరవాలేదు. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కూరగాయలు: గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆకు పచ్చని కూరగాయలు చాలా లాభదాయకం. ఎందుకంటే ఆకుపచ్చని కూరగాయల్లో చాలా పోషక గుణాలుంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి దోహదపడుతుంది. రోజూ ఆకుపచ్చని కూరగాయలు, హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

స్ట్రెస్ ఫ్రీ: ముందుగా చెప్పుకున్నట్లే మన ఉద్యోగాలన్నీ కూడా మతి ఆధారంగా  పనిచేసేవే. ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఒత్తిడి కలుగుతుంది. దీనిని నియంత్రించకపోతే గుండెపోటకు కారణం కాగలదు. ఇంకా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కాగలదు.

వైద్య పరీక్షలు: 40 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, డయాబెటిస్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకుని జాగ్రత్తపడాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..