Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం.. రోజూ తీసుకుంటే మెరిసే చర్మం కూడా మీ సొంతం..

వంటింట్లో లభించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులను సరైన విధంగా ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యా కూడా మన దరిచేరదు. అంతేకాక బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఇక అలా మన ఆరోగ్యాన్ని కాపాడేవాటిలో సొంపు గింజలు కూడా..

Health Tips: ఆ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం.. రోజూ తీసుకుంటే మెరిసే చర్మం కూడా మీ సొంతం..
Fennel Seeds Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 14, 2023 | 9:38 AM

చాలా మందికి తెలియని లేదా అర్థం కాని విషయం ఏమిటంటే.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వంటింట్లోని పదార్థాలను సరిగా ఉపయోగించుకుంటే చాలు. అవును, వంటింట్లో లభించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులను సరైన విధంగా ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యా కూడా మన దరిచేరదు. అంతేకాక బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఇక అలా మన ఆరోగ్యాన్ని కాపాడేవాటిలో సొంపు గింజలు కూడా ఉన్నాయి. ఈ సొంపు గింజల ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. వీటిని తింటే తొందరగా బరువు తగ్గవచ్చు, శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుచుకోవచ్చు. ముఖ్యంగా సంతానలేమి, శృంగార సమస్యలకు ఇది ఓ చక్కని పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్లు, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. అయితే ఈ సొంపు గింజలను రోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..

సొంపు గింజలతో కలిగే ప్రయోజనాలు

సంతానోత్పత్తి: ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతల కారణంగా కలిగే ఒత్తిడి ఫలితంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు లేదా తొందరగా తండ్రి కావాలనుకునేవారు ఈ సొంపు గింజలను తింటే వారికి ప్రయోజనకరం.

బరువుకు చెక్: బరువు తగ్గించుకునే ప్రయత్నాలను కనుక మీరు చేస్తుంటే సోంపు తప్పకుండా వినియోగించాల్సిందే. సోంపు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గించేందుకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

గ్లోయింగ స్కిన్: సొంపు గింజలు యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాన్ని కలిగినందును ఇవి చర్మ సమస్యలను నిరోధిస్తాయి. అంతేకాక చర్మంపై దాడి చేసే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. సొంపు గింజలకు యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉండడం వల్ల.. చర్మంపై ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ: సోంపులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉన్నందు వల్ల వీటితో ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఫలితంగా శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి శరీరానికి లభిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..