- Telugu News Photo Gallery Business photos 10 seater Force Citiline MUV launched at Rs 15.93 lakh checkout for features and price details
Force Citiline 10 Seater: కార్ ప్రేమికులకు శుభవార్త.. అతి తక్కువ ధరకే 10 సీటర్ కార్.. అద్భుతమైన ఫీచర్లు-అద్దిరిపోయే లుక్..
సరదాగా కుటుంబంతో కలిసి ప్రయాణించాలంటే కార్ సరిపోవడంలేదా..? అయితే మీ కోసమే ఓ కొత్త కార్ వివరాలను తీసుకువచ్చాం. ఈ కార్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 10 సీటర్ కార్. అంటే ఇందులో ఒకేసారి 10 మంది ప్రయాణించవచ్చు. ఇంకా ఈ కార్ ధర, ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 14, 2023 | 8:11 AM

మీరు పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తున్నట్లయితే, మీకు శుభవార్త. మీ కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు మీరు ఇకపై ఇబ్బంది పడనవసరంలేదు. అవును, ఫోర్స్ మోటార్స్ నుంచి ఫోర్స్ సిటీలైన్ అనే కొత్త కారు తాజాగా ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేయబడింది. ఇక దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 10 సీటర్ కార్. అంటే ఇందులో ఒకేసారి 10 మంది ప్రయాణించవచ్చు.

భారత మార్కెట్‌లో ఫోర్స్ సిటీలైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.93 లక్షలు. ఇక దీని డిజైన్ ట్రాక్స్ క్రూయిజర్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ ఫోర్స్ సిటీలైట్‌లో ట్రాక్స్ క్రూయిజర్‌కు కంటే భిన్నమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. సిటీలైన్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ బాడీ కలర్‌లోనే ఉన్నాయి. ఫోర్స్ గూర్ఖా లేదా అర్బేనియాలో మనం చూసే విధంగానే గ్రిల్‌లో సిటీలైన్ లోగో కూడా ఉంటుంది.

ఈ కారులో ఉన్న అతిపెద్ద ప్రయోజనం సీటింగ్ కెపాసిటీ. మీ కుటుంబం మొత్తం కూడా ఈ 10 సీటర్ కారులో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అయితే, ఫీచర్ల పరంగా ఇది కొంచెం తక్కువగా ఉండవచ్చు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వలేదు. ఈ కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కంటే కూడా చిన్నది. లోవర్ బాడీ పార్ట్స్ బ్లాక్ ప్లాస్టిక్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఫోర్స్ పెద్ద కారు డ్యూయల్ AC సిస్టమ్‌తో పాటు గొప్ప డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులో ఉంటుంది.

సిటీలైన్ ముందు చక్రాల పైన మూడు-స్లాట్ ఎయిర్ వెంట్లను పొందుతుంది. వీల్ ఆర్చ్‌లు, లోవర్ బాడీ పార్ట్స్ బ్లాక్ ప్లాస్టిక్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఫోర్స్ పెద్ద కారు డ్యూయల్ AC సిస్టమ్‌తో పాటు గొప్ప డ్యాష్‌బోర్డ్ కూడా అందుబాటులో ఉంటుంది.

పవర్ పరంగా ఫోర్స్ సిటీలైట్ 4 సిలిండర్, 2,596సీసీ శక్తివంతమైన ఇంజన్‌ను పొందుతుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. సిటీలైట్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.





























