సుజుకి యాక్సెస్ 125(Suzuki Access 125).. ఈ స్కూటర్ 8.6bhp, 10Nm టార్క్ ను ఉత్పత్తి చేసే 124సీసీ ఇంజిన్ తో వస్తోంది. స్టాండర్డ్ ఎడిషన్ డ్రమ్ బ్రేక్ రూ. 79,400, స్టాండర్డ్ ఎడిషన్ డ్రమ్ బ్రేక్, విత్ అల్లాయ్స్ రూ. 79,600, స్టాండర్డ్ ఎడిషన్ డిస్క్ బ్రేక్ వేరింయట్ రూ. 83,100. స్పెషల్ ఎడిషన్ డిస్క్ ట్రిమ్ ధర రూ. 84,800 గా ఉంది. అలాగే రైడ్ కనెక్ట్ ఎడిషన్ డ్రమ్ విత్ అల్లాయ్ వీల్స్ రూ. 85,500, రైడ్ కనెక్ట్ ఎడిషన్ డిస్క్ విత్ అల్లాయ్ రూ. 89,500 ఎక్స్ షోరూం గా ఉంది. దీనిలో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, సైడ్ స్టాండ్ లాక్ , యూఎసబీ ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.