- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Kagiso Rabada becomes fastest player to pick 100 wickets in Indian Premier League and breaks Bravo's record
IPL 2023: ఐపీఎల్‌లో ‘రబాడా’ సరికొత్త రికార్డు.. బ్రావో, మలింగను అధిగమించి అగ్రస్థానంలోకి..
గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడిన కసిగో రబడ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Updated on: Apr 14, 2023 | 7:00 AM

ఐపీఎల్ 2023: మొహాలీ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడిన కసిగో రబడ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాక చెన్నై మాజీ ప్లేయన్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

అవును, ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా వికెట్ తీసి కగిసో రబడ ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించాడు. ఇంకా 100 ఐపీఎల్ వికెట్లు తీసుకున్నవారి కంటే రబాడా వేగవంతంగా(తక్కువ బంతులలో) ఈ ఘనతను సాధించడం గమనార్హం.

గురువారం జరిగిన GT vs PBKS మ్యాచ్‌కు ముందు తక్కువ బంతులలో 100 వికెట్లు తీసిన రికార్డు చెన్నై మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును రబాడా తన సొంతం చేసుకున్నాడు. బ్రావో 1619 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా.. రబాడా 1438 బంతుల్లోనే 100 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన టాప్ 4 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. కగిసో రబాడా: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరఫున బౌలింగ్ చేసిన కగిసో రబాడా 1438 బంతుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా రిచ్ టోర్నీలో అత్యల్ప బంతుల్లోనే 100 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా అవతరించాడు. మరోవైపు రబాడా 64 మ్యాచ్‌లలోనే ఈ ఘనతను సాధించాడు.

2. డ్వేన్ బ్రావో: ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన డ్వేన్ బ్రావో 1619 బంతుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ టోర్నీలో రబాడా కంటే ముందు అత్యల్ప బంతుల్లోనే 100 వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

3. లసిత్ మలింగ: ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగ 70 మ్యాచ్‌లలో 1622 బంతులు వేసి 100 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తర్వాత అత్యల్ప బంతుల్లోనే 100 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా మలింగ ఉన్నాడు.

4. హర్షల్ పటేల్: ఈ లిస్టు నాలుగో స్థానంలో భారత్‌కు చెందిన హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బౌలింగ్ చేసిన హర్షల్1647 బంతుల్లో 100 వికెట్లు పడగొట్టాడు.





























