- Telugu News Sports News Cricket news Bombay high court notice to team india young player prithvi shaw in sapna gill selfie case
IPL 2023: పృథ్వీ షాకు మరో షాకింగ్ న్యూస్.. నోటీసులిచ్చిన హైకోర్ట్.. కారణం ఏంటంటే?
ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Updated on: Apr 13, 2023 | 8:49 PM

ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫిబ్రవరిలో క్రికెటర్ పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సప్నా గిల్ బేస్‌బాల్‌తో తనపై దాడి చేసిందంటూ పృథ్వీ ఆరోపించాడు. ఆరోపణల తర్వాత సప్నా, ఆమె స్నేహితుడిని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత, సప్నా పృథ్వీపై మారణాయుధంతో దాడి చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.

అనంతరం షాపై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సమయంలో సప్నా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సప్నా దరఖాస్తుపై పృథ్వీ షా, ఆమె స్నేహితుడు, కొంతమంది పోలీసు అధికారులతో సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది.

ఫిబ్రవరిలో షా తన స్నేహితులతో కలిసి ముంబైలోని ఓ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ సప్నా, ఆమె స్నేహితుల్లో ఒకరు సెల్ఫీ కోసం పృథ్వీని పదే పదే అభ్యర్థించారు. దీనిపై షా హోటల్ మేనేజర్‌కి ఫిర్యాదు చేయగా, సప్నా, ఆమె స్నేహితుడిని హోటల్ నుంచి బయటకు పంపారు. దీంతో కోపోద్రిక్తుడైన సప్న, హోటల్ నుంచి బయలుదేరిన వెంటనే పృథ్వీ కారును వెంబడించి, రోడ్డుపై గొడవ చేసి దాడికి ప్రయత్నించింది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7, 0, 15 పరుగులు చేశాడు. అలాగే ఢిల్లీ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.





























