- Telugu News Photo Gallery Cricket photos Ipl 2023 rajasthan royals player jos buttler in fastest to 3000 ipl runs
IPL 2023: ఐపీఎల్‌లో పరుగుల తోపులు.. లిస్టులో చేరిన డేంజరస్ ప్లేయర్.. టాప్ 5లో భారత్ నుంచి ఒక్కడే..
IPL 2023: చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ అర్ధశతకం సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే వేగంగా పరుగులు చేసిన టాప్-3 జాబితాలోకి ప్రవేశించాడు.
Updated on: Apr 13, 2023 | 8:44 PM

IPL 2023: చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ అర్ధశతకం సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే వేగంగా పరుగులు చేసిన టాప్-3 జాబితాలోకి ప్రవేశించాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున తొలుత బ్యాటింగ్ చేసిన బట్లర్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 3000 వేల పరుగులు పూర్తి చేసిన ప్రత్యేక జాబితాలో చేరాడు.

అంతే కాకుండా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1- క్రిస్ గేల్: యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కేవలం 75 ఇన్నింగ్స్‌ల్లోనే 3000 వేల పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

2- కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 3 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 80 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

3- జోస్ బట్లర్: CSKపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా, బట్లర్ 85 IPL ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు సాధించాడు.

4- డేవిడ్ వార్నర్: డేవిడ్ వార్నర్ 94 ఇన్నింగ్స్‌ల ద్వారా IPLలో 3000 పరుగులు పూర్తి చేశాడు.

5- ఫాఫ్ డుప్లెసిస్: RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 94 IPL ఇన్నింగ్స్ ద్వారా 3 వేల పరుగులు పూర్తి చేశాడు.





























