- Telugu News Photo Gallery Cricket photos Punjab Kings vs Gujarat Titans clash in IPL 2023 18th Match Punjab Cricket Association IS Bindra Stadium, Mohali
IPL 2023: మరో హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఎంట్రీ ఇచ్చిన తుఫాన్ ప్లేయర్.. ఇక గుజరాత్‌కు చుక్కలే..
Punjab vs Gujarat: పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఒకదానిలో ఓడి -0.281 రన్ రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. అలాగే, గుజరాత్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ఒకదానిలో ఓడిపోయింది. రన్ రేట్ (+0.431)తో నాల్గవ స్థానంలో ఉంది.
Updated on: Apr 13, 2023 | 2:56 PM

PBKS vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ 18వ మ్యాచ్ నేడు జరగనుంది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.

పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించి -0.281 రన్ రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. అలాగే, GT జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది మరియు ఒకదానిలో ఓడిపోయింది మరియు రన్ రేట్ (+0.431) ఆధారంగా నాల్గవ స్థానంలో ఉంది.

పంజాబ్ జట్టులో ఓపెనర్లుగా ఉన్న కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ మినహా మిగతా అందరూ విఫలమవుతున్నారు. ఓపెనర్లు చేసినన్ని పరుగులు చేయలేకపోతున్నారు.

జట్టులో మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ, సామ్ కుర్రాన్, సికిందర్ రాజా, షారుఖ్ ఖాన్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ ఎవరూ సహకరించడం లేదు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎలోస్, రాహుల్ చాహర్ కూడా వికెట్ టేకర్లుగా కనిపించలేదు.

గత మ్యాచ్‌లో జీటీ జట్టు ఓడిపోయినా.. బలంగానే ఉంది. కెప్టెన్ హార్దిక్ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. సాయి సుదర్శన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. విజయ్ శంకర్ కూడా తన తుఫాన్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా కూడా ఉన్నారు.

రషీద్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు. మహ్మద్ షమీ, జాషువా లిటిల్, అల్గేరి జోసెఫ్ ముఖ్యమైన బౌలర్లు.




