AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2026: హోలికా దహనంలో ఈ కలప వాడితే… ఏం జరుగుతుందో తెలుసా..?

హోలికా దహనం… మనలోని కోపం, అసూయ, అహంకారం వంటి చెడు భావాలను అగ్నికి ఆహుతి చేసే పవిత్ర కార్యక్రమం. ఫాల్గుణ పౌర్ణమి రాత్రి జరిగే ఈ ఆచారానికి శాస్త్రాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఇందులో ఎలాంటి కలప వాడాలి? ఏ చెట్లను కాల్చకూడదు? అన్న విషయాల్లోనూ స్పష్టమైన సూచనలు ఉన్నాయి.

Holi 2026: హోలికా దహనంలో ఈ కలప వాడితే… ఏం జరుగుతుందో తెలుసా..?
Holika Dahan
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 8:49 AM

Share

హోలికా దహనం రోజున వెలిగించే మంట మనిషిలోని కోపం, అసూయ, అహంకారం వంటి ఆలోచనలను దహిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల హోలికా దహనం కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత ఉంది. అయితే ఇందులో ఎలాంటి కలపను వినియోగించాలి, ఏవి నిషిద్ధం అనే విషయాలను సైతం శాస్త్రాలలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చ్ 4 న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే దానికి ఒక్కరోజు ముందు 3న అంటే మంగళవారం రాత్రి హోలికా దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫాల్గుణ పౌర్ణమి రాత్రి జరిగే హోలికా దహనం కార్యక్రమంలో ఎలాంటి కల్పవాడకూడదో మీకు తెలుసా ?.

ముఖ్యంగా ఇందులో రాలిన, ఎండిన కలప ను మాత్రమే వాడాలని శాస్త్రం చెబుతుంది. అదే విధంగా రావిచెట్టును పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. దీన్ని కాల్చటం వల్ల అశుభం అని పండితులు చెబుతున్నారు. దీనితోపాటు పూజలలో వినియోగించే జమ్మి, ఇంటికి తోరణాలుగా ముఖ్యంగా శుభ కార్యాలలో వినియోగించే మామిడి, ఔషధ ప్రాధాన్యత ఉన్న ఉసిరి, దైవస్వరూపంగాను ఆరోగ్యప్రదాయినిగాను భావించే వేప, పూజల్లో వినియోగించే అరటి చెట్లను కాల్చడం శాస్త్రవిరుద్దం. అదేవిధంగా బిల్వ పత్రాలు, ఆ చెట్టు కొమ్మలను దీనికి ఉపయోగించకూడదు. ఈ కార్యక్రమంలో పవిత్రంగా భావించేవి, పూజల్లో వినియోగించే చెట్ల కలప వాడకూడదనేది నిర్వివాదాంశం. నేలపై పడి.. సహజంగా ఎండి పోయిన చెట్ల కట్టెలు, ఎండిన ఆకులు, వరి.. అదే విధంగా గోధుమ పొట్టు, ఎండిన కొబ్బరి ఆకులు.. వాటి మట్టలు వంటి వాటిని వాడవచ్చని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా సజీవంగా ఉన్న చెట్లను కలపను అసలు తీసుకురాకూడదట. అదే విధంగా పర్యావరణానికి హాని కలిగించని కలప వాడటం ఇంకా మంచిది. గోమయంతో చేసిన పిడకలు వినియోగం మంచి ఫలితాన్నిఇస్తుందట.

Also Read: మోటార్ లేకుండా కాలువ నుంచి వాటర్ ఇలా తీయవచ్చు.. 

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు