- Telugu News Photo Gallery Post pregnancy fitness tips: Follow these tips to reduce belly after delivery
Post-pregnancy Fitness Tips: ప్రసవం తర్వాత పొట్ట తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..
గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు పొట్ట పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. కానీ కొంతమంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కొంచెం ఎత్తుగా కనిపిస్తుంటుంది. ఫలితంగా మహిళలు..
Updated on: Apr 14, 2023 | 9:08 AM

గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు పొట్ట పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. కానీ కొంతమంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కొంచెం ఎత్తుగా కనిపిస్తుంటుంది. ఫలితంగా మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. కొన్ని సహజ పద్ధతుల ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..

గోరువెచ్చటి నీళ్లలో ఓ స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడకట్టి వరుసగా 40 రోజుల పాటు తాగితే పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది.

రెండు లీటర్ల నీటిలో ఒక్కోస్పూన్ చొప్పున బార్లీ, వాము వేసి క్రమంతప్పకుండా 40 రోజులపాటు తాగినా పొట్ట ఇట్టే కరిగిపోతుంది.

పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలివ్వడం వల్ల రోజుకు శరీరంలో క్యాలరీలు అధికంగా ఖర్చవుతాయి. ఇలా చేసినా ప్రసవానంతరం పొట్ట తగ్గించుకోవచ్చు.





























