Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సంస్కృతి ఏదైనా అందులో ప్రధాని మోదీ భాగమే.. ‘సాంస్కృతిక ఐక్యత’ కోసం ఏమేం చేశారంటే..

మన దేశంలోని వివిధ సంస్కృతులవారు జరుపుకునే పండుగలను, కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో ప్రోత్సాహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగ కార్యక్రమాలకు ఆయన హాజరైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అంతెందుకు.. ఈ రోజు అస్సాంలో జరగబోయే

PM Modi: సంస్కృతి ఏదైనా అందులో ప్రధాని మోదీ భాగమే.. ‘సాంస్కృతిక ఐక్యత’ కోసం ఏమేం చేశారంటే..
Pm Modi In Traditional Khasi Outfit Of Meghalaya
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 14, 2023 | 10:21 AM

భారత దేశం విభిన్న సంస్కృతులకు నిలయం. నిత్యం దేశంలోని ఏదో ఒక మూల ఏదో ఓ సాంస్కృతిక కార్యక్రమం, పండుగ, జాతరలు జరుగుతూనే ఉంటాయి.  ఇక మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశంలోని వివిధ సంస్కృతులవారు జరుపుకునే పండుగలను, కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సాహిస్తారు. ఇంకా సాంస్కృతిక వైవిధ్యంలో ఐక్యత ఉండాలని ఆయన పిలుపునిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగ కార్యక్రమాలకు ఆయన హాజరైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అంతెందుకు.. ఈ రోజు కూడా అస్సాంలో జరగబోయే బిహు వేడుకల్లో మోదీ పాల్గొనున్నారు. నిన్న కూడా ఆయన తమిళ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే గత వారం ఈస్టర్ సందర్భంగా ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ చర్చ్‌ను ప్రధాని సందర్శించారు. 

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగం అయ్యేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. దేశంలో సాంస్కృతిక ఐక్యత ఉండాలని, అన్ని సంస్కృతులకు ప్రోత్సాహం ఉండాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే గత నెలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు కూడా ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకముందు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూ ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ‘బరిసు కన్నడ డిమ్ దిమావా’ సాంస్కృతిక ఉత్సవాన్ని PM ప్రారంభించారు. అలాగే గతేడాది నవంబర్‌లో జరిగిన గురునానక్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ మైనారిటీల కమిషన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసంలో శ్రీ గురునానక్ దేవ్ జీ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు.

అదేనెలలో మణిపూర్ సంగై ఉత్సవం సందర్భంగా కూడా వర్చ్యూవల్ మోడ్‌లో ప్రసంగించారు మోదీ. గత అక్టోబరులో హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని ధల్‌పూర్ మైదానంలో కులు దసరా వేడుకల్లో.. అలాగే సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగమయ్యారు. ఇక అంతకముందు నెల(ఆగస్టు)లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకల్లో కూడా సమ్మిళితమయ్యారు మోదీ.

ఇవి కూడా చదవండి

అలాగే 2022 మేలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని మహాప్రినిర్వాణ స్థూపం వద్ద ప్రధానమంత్రి ప్రార్థనలు చేశారు. ఆ శుభ సందర్భంలోనే నేపాల్‌లోని లుంబినీ(బుద్ధుని జన్మస్థలం)కి అధికారిక పర్యటన కూడా చేసాడు. గతేడాది ఏప్రిల్‌లో ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నిర్వహించిన బిహు వేడుకలకు.. అదే ఏడాది ఫిబ్రవరిలో రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. అంతకుముందు వారణాసిలో జరిగిన దేవ్ దీపావళి మహోత్సవ్‌కి ప్రధాని హాజరయ్యారు. మకర సంక్రాంతి నాడు మాజీ కేంద్ర మంత్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ నివాసంలో జరిగిన‘చూడా దహీ భోజ్’కు కూడా ప్రధాని మోదీ హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..