AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్.. మెరుపువేగమంటే ఇది కదా..! ఫార్మసిస్ట్‌ టైపింగ్‌ స్కిల్స్‌కు నెటిజన్స్‌ ఫిదా..

అభ్యాసం కూసువిద్య.. సామెత వినే ఉంటారు. ఏదైనా ఒక పనిని నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి ఆ పనిలో ప్రావిణ్యం సాధించవచ్చని దాని అర్ధం. డ్రాయింగ్‌, ఆటలు, సంగీతం, చదువు, కొత్త భాష.. ఇలా ఏదైనా ఒక విషయంపై నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి అందులో చేయి తిరిగిన..

Viral Video: వావ్.. మెరుపువేగమంటే ఇది కదా..! ఫార్మసిస్ట్‌ టైపింగ్‌ స్కిల్స్‌కు నెటిజన్స్‌ ఫిదా..
Speed Typing
Srilakshmi C
|

Updated on: Apr 14, 2023 | 9:48 AM

Share

అభ్యాసం కూసువిద్య.. సామెత వినే ఉంటారు. ఏదైనా ఒక పనిని నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి ఆ పనిలో ప్రావిణ్యం సాధించవచ్చని దాని అర్ధం. డ్రాయింగ్‌, ఆటలు, సంగీతం, స్టడీస్, కొత్త భాష.. ఇలా ఏదైనా ఒక విషయంపై నిరంతరం సాధన చేస్తే కొంతకాలానికి అందులో చేయి తిరిగిన నిష్ణాతులవుతారు. మనలో చాలా మంది వృత్తి రిత్యా లేదా సొంతంగా ఇంట్లో కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ వాడుతూ ఉంటారు. కంప్యూటర్‌ కీబోర్డును కొత్త మంది చాలా నిదానంగా టైప్ చేస్తే.. మరికొందరేమో రోజూ అదేపని చేయడం వల్ల మెరుపువేగంతో టైప్‌ చేస్తుంటారు. కీ బోర్డుపై వారి చేతి వేళ్లు మెరుపు వేగంతో పరుగులు తీస్తుంటాయి. తాజాగా ఓ ఫార్మసీ షాపులో బిల్లిల చెల్లింపుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసే వ్యక్తి పనితనాన్ని చూసి నెటిజన్లు ‘వావ్‌..’ అనకుండా ఉండలేకపోతున్నారు. నమ్మలేకపోతున్నారా? ఐతే మీరూ ఈ వీడియో చూసేయండి..

బిల్లింగ్ కౌంటర్‌లో ఫార్మసీ సిబ్బంది కస్టమర్లకు మెడిసిన్‌ ఇవ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఐతే వారిలో ఓ వ్యక్తి మందుల వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేస్తుంటాడు. ఇక్కడే అందరి దృష్టి అతను ఆకర్షించాడు. కస్టమర్లతో బిజీగా ఉన్న ఫార్మసీ షాపులో రిసెప్షనిస్ట్ కస్టమర్‌ల బిల్లింగ్ వివరాలను కనీసం కంప్యూటర్‌ వైపు చూడకుండానే క్షణాల్లో సిస్టమ్‌లో నమోదు చేసి బిల్లింగ్‌ పూర్తి చేయడం వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇతను ఇండియాలో బిజీగా ఉన్న ఫార్మసీలో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్‌’ అనే క్యాప్షన్‌తో సీసీటీవీ ఇడియట్స్‌ అనే యూజర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతే క్షణాల్లో మిలియన్ల కొద్ది వీక్షణలు, లైకులు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే