AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips to Increase Children Height: మీ పిల్లలు వయసుకు తగ్గా ఎత్తు పెరగాలంటే ఇలా చేయండి..

వయసుకు తగ్గరీతిలో పిల్లలు ఎత్తు పెరగకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అలాగే ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాలి. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా ఉంటుంది. ఈ తర్వాత ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన..

Srilakshmi C
|

Updated on: Apr 13, 2023 | 2:27 PM

Share
వయసుకు తగ్గరీతిలో పిల్లలు ఎత్తు పెరగకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అలాగే ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాలి. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా ఉంటుంది. ఈ తర్వాత ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించాలి. నిజానికి ఎత్తు పెరగడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు. కృత్రిమంగా వచ్చేదీ కూడా కాదు.

1 / 5
క్యారెట్, బీన్స్, బెండకాయ, బచ్చలికూర, బఠానీలు, అరటిపండు, సోయాబీన్, పాలు.. వంటి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది.

2 / 5
ఆహారంతోపాటు తేలికపాటి ఎక్సర్‌సైజులు కూడా చేస్తుండాలి. బార్‌ హ్యాంగింగ్స్‌, హ్యాంగింగ్‌ రాడ్‌, పులప్స్‌, చిన్‌-అప్స్‌.. వంటి ఎక్సర్‌సైజెస్‌ వెన్నెముకను సులభంగా సాగేలా చేస్తాయి. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగచ్చు. అలాగే ఈ వ్యాయామాలు వెన్ను, భుజాల కండరాలకు దృఢత్వాన్ని అందించి ఫిట్‌గా మార్చుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
స్కిప్పింగ్‌ కూడా చక్కని పిల్లలకు చక్కని వ్యాయామం. స్కిప్పింగ్‌ చేయడం వల్ల వెన్నెముక, భుజాలు, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. సులభంగా సాగేలా తయారవుతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు కూడా ఈజీగా పెరుగుతుంది.

4 / 5
మన శరీరంలో హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోన్‌ అనే పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్‌ ఉంటుంది. ఇది పిల్లల్లో నిద్రపోయినప్పుడు మాత్రమే విడుదలవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  అందుకే చిన్నారుల ఎంత నిద్రపోతే అంతగా పెరుగుతారని చెబుతున్నారు.

5 / 5