Video: అమానుషం..! మేనేజర్‌ను పోల్‌కు కట్టేసి రాడ్డుతో చితకబాది చంపేశారు.. వీడియో వైరల్

ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పోల్‌కు కట్టేసి, రాడ్డుతో చావకొట్టారు. చనిపోయిన మేనేజర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేశారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Video: అమానుషం..! మేనేజర్‌ను పోల్‌కు కట్టేసి రాడ్డుతో చితకబాది చంపేశారు.. వీడియో వైరల్
Uttar Pradesh Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2023 | 1:44 PM

ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పోల్‌కు కట్టేసి, రాడ్డుతో చావకొట్టారు. చనిపోయిన మేనేజర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేశారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌, షాజాహన్‌పూర్‌లో బంకిమ్ సూరి అనే ట్రాన్స్‌పోర్టు వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరీ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఐతే కన్హియా హోజరీకి చెందిన ఓ పార్సిల్ కనిపించడంలేదనే నెపంతో మేనేజర్‌పై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. దీంతో మేనేజర్ శివమ్‌ పై కన్హియా హోజరీ కంపెనీ యాజమాని నీరజ్‌ గుప్తాతోపాటు మరో ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. బాధితుడిని పోల్‌కు కట్టేసి రాడ్డుతో విచక్షణా రహితంగా చావగొట్టారు. దెబ్బలు తట్టుకోలేక శివమ్‌ మృతి చెందడంతో అతని మృతదేహాన్ని మెడికల్ కాలేజీ ముందు మంగళవారం రాత్రి పడేశారు. అనంతరం కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. మిస్సైప ప్యాకేజీ విషయంలో అనుమానం వచ్చిన ప్రతి ఉద్యోగిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు శివమ్‌ను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ కావడంతో కన్హయ్య షాపు ఓనర్ నీరజ్ గుప్తాతోపాటు మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోస్టుమార్టమ్‌లో మరిన్ని నిజాలు బయటపడతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే